
ఇక మిగిలిన సంవత్సర కాలం అధికార వైసీపీ ఏమి చేస్తే మళ్ళీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అన్నదానిపైనే పార్టీ హై కమాండ్ లో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే 2024 లో జరగనున్న ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేనల నుండి పోటీ విపరీతంగా అధికార పార్టీపై ఉండనుంది. కేవలం ఒక్క జగన్ మాత్రమే ఎన్నికల్లో గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు అని తెలిసిందే. అందుకే రాష్ట్రంలో ఉన్న 175 శాసనసభ స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ గా చెప్పుకునే 88 స్థానాలను వైసీపీ గెలుచుకోవలసి వస్తుంది. అప్పుడే అధికారాన్ని దక్కించుకోగలదు.
అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి అన్ని సీట్లు వస్తాయా అంటే అనుమానమే అని చెప్పాలి. సీఎం గా ఉన్న జగన్ మొదటి నుండి కూడా తానే అన్నీ అయ్యి పార్టీని , పాలనను సాగించాడు తప్ప.. తనలాంటి కసి, బాధ్యత, ప్రజల యందు ప్రేమ ఉన్న నాయకులను అయితే తయారు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడని రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. పేరుకు చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా జగన్ వారిని తనలా కసి ఉన్న రాజకీయనాయకులుగా మార్చలేకపోవడం బాధాకరం . ఒకవేళ 2024 ఎన్నికల్లో జగన్ అధికారాన్ని కోల్పోతే మాత్రం అందుకు పూర్తి బాధ్యత జగన్ దే అవుతుంది.