తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం గురించి కేసీఆర్ సర్కారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే. దీని కోసం కేసీఆర్ సర్కారు కోర్టుల్లో ఎంతగానో పోరాడింది. నాలుగైదు సార్లు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చినా మొత్తానికి పాత సచివాలయం కూల్చివేతకు అడ్డంకులు తొలగించుకుంది. ఇప్పుడు ఆగమేఘాల మీద కొత్త సచివాలయం నిర్మాణపనులు చేయించాలని ప్లాన్ చేస్తోంది.


సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కొత్త సెక్రటేరియట్ డిజైన్, నిర్మాణ విశేషాల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు స్వయంగా దీనిపై మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ కొత్త సెక్రటేరియట్ ను గురించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యేకించి కొత్త సెక్రటేరియట్ ఆరో ఫ్లోర్‌లో అదిరిపోయే ప్రత్యేకతలు ఉన్నాయట. ఎందుకంటే ఈ ఆరో ఫ్లోర్‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫీసు ఉంటుంది.


ఈ ఫ్లోర్ విశేషాలు ఏంటంటే..  ఆ ఫ్లోర్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ చేస్తారట. సీఎం చాంబర్ నుంచి మొదలు పెడితే ఆయన వాడే టాయిలెట్ దాకా అన్నిటింకీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమరుస్తారట. ఫ్లోర్ లోని కిటికీలు, తలుపులు, వెంటిలేటర్స్.. ఇలా ప్రతి అద్దం బుల్లెట్ ప్రూఫ్ అవుతాయట. లక్ష చదరపు అడుగుల విస్తీరణం్లో ఉండే ఈ ఆరో అంతస్తులో అన్ని తలుపులు, కిటికీలు, వెంటిలెటర్స్.. అన్నింటికీ బుల్లెట్ ప్రూఫ్ చేస్తారట.


ఈ ఆరో అంతస్తులో దాదాపు 70 కిటికీలు, 15 తలుపులు, 30 వెంటి లేటర్లను బుల్లెట్ ఫ్రూఫ్ చేస్తారట.  అద్దం అవసరం ఉన్న ప్రతి చోట బుల్లెట్ ప్రూఫ్ వాడుతారట. ఈ అద్దాలు ఏకే 47 కాల్పులను సైతం  తట్టుకునేలా ఉంటాయట. ఆఫీసర్లు, మంత్రులతో మీటింగ్ జరిపే కాన్ఫరెన్స్ హాల్ కు కూడా బుల్లెట్ ప్రూఫ్ చేస్తారట. మొత్తం సెక్ర టేరియట్ బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు చేసేందుకు ఏకంగా 50 కోట్లు ఖర్చు చేస్తారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: