
ప్రతి పక్ష నాయకులు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం. వీరేమో వారిపై ఆరోపణలు చేయడానికే సరిపోయింది. అయితే వాస్తవం ఏమి జరిగిందనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ విషయాన్ని బయటపెట్టడానికి సీఐడీ విచారణ ప్రారంభించింది. దీనికి మంగళవారం సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారుల నుండి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని మీడియా వారితో ఈ విధంగా మాట్లాడారు...ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం చేసిన చర్య అని, ఈ ఘటన ప్రభుత్వం పై వారికున్న కక్షను తెలియచేస్తుందని తెలిపారు.
అంతే కాకుండా ఈ దుశ్చర్యకు ఉపయోగించిన రంపం దొరికిందని అలాగే మరి కొన్ని ముఖ్యమైన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇది ఒక వేళ దొంగతనం గనుక అయితే గుడిలో ఎటువంటి నగలు కానీ ఇతరత్రా వస్తువులు కానీ వారు తీసుకోలేదని, కేవలం రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇది చేసారని, అతి త్వరలోనే నిస్పక్షపాతంగా దర్యాప్తును జరిపి దీనికి కారణమయిన దుండగులను పట్టుకుంటామని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనితో రాష్ట్రంలో కొంతమేర ఈ ఘటన గురించి ప్రజలకు భరోసా లభించింది. ఇంతకీ ఎవరు చేసారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.