నిద్ర లేపుతున్న అని రేవంత్
ఓ సారి కాదు రోజుకు వందసార్లు
అనుకోవచ్చు కానీ జరిగేది వేరే?
మల్లు రవి, భట్టి విక్రమార్క,
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి
ఇంకా ఇంకొందరు
ఆయన మాట వింటారు అనుకోవడంలో
అవివేకం ఉంది.
ఓయూ జేఏసీకి టీపీసీసీ చీఫ్ కు తేడా ఏంటో తెల్సుకోవాలి. ప్రాజెక్టులు ఏంటి? వాటి నిల్వలేంటి ? నిల్వ సామర్థ్యం ఏంటి? తెలుగు రాష్ట్రాల సఖ్యత ఏంటి ? ఇవి కూడా తెలియాలి. రెడ్డి సామాజికవర్గం నేతలంతా రేవంత్ వెనుక ఎలా ఉండరో .. కాంగ్రెస్ ను ప్రేమించే వారంతా రేవంత్ వెనుక ఉండరన్న వాస్తవం కూడా తెలుసుకోవాలి. దండోరాలు పేరిట సభలకు చేసే ఖర్చు బాగానే ఉన్నా వీటి ఫలితం రేపటి వేళ టీఆర్ఎస్ కు అనుకూలం అయితే అప్పుడు ఏం చేస్తారు? తిట్టడంలో కేసీఆర్ ను దాటిపోయాం అనుకోవడం అవివేకం .. కేసీఆర్ ఇప్పటికే ఆ తరహా మాటలకు అలవాటు పడిపోయారు. ఆయన మాట తీరుకు అటు జనంలోనూ ఇటు మీడియాలోనూ చాలా చాలా చర్చకూడా జరిగిపోయింది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి కేసీఆర్ ను తిడితే హీరోలు అవ్వరు. సీనియర్లను కలుపుకుని పోతే హీరోలు అవుతారు. ఆదివాసీలు, దళితులు వీరంతా చెప్పే మాటలు విని వారి హక్కుల కోసం రోడ్లెక్కితే అప్పుడు హీరోలవుతారు. రేవంత్ ను ఉత్తమ్ అంగీకరించడు. రేవంత్ ను అదే సామాజికవర్గం నేతలు కోమటిరెడ్డి సోదరులు అంగీకరించారు. ఆయన సామాజికవర్గానికే చెందిన నేతలు ఇప్పుడు ఆయనకు గోతులు తవ్వి రాజకీయ భవిష్యత్ అన్నది లేకుండా చేయాలన్న ఆలోచనతో నిత్యం పనిచేస్తుంటే ఇక ఆయన ఎదిగేది ఎప్పుడు. ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే చాలా చిన్న పని అని భావించకండి రేవంత్.. మీరు అక్కడని ఇక్కడని కాకుండా అన్ని చోట్లా సోనియా భజన చేసి, సీనియ ర్లను పట్టింకోకుండా సభల్లో వారి పేర్లు కేవలం ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేస్తే పార్టీ భవిష్యత్ ఏమో కానీ మీ భవిష్యత్ శూన్యం అవుతుందేమో! అన్నది ఆలోచించండి అని ప రిశీలకులు తమ మాటగా చెబుతున్నారు.
ఫక్తు టీడీపీ ఏజెంట్ రేవంత్ అని టీఆర్ఎస్ రోజూ చెబుతూనే ఉంటుంది. ఆ ముద్ర చెరిగినా,చెరగకున్నా ఆయన సోనియా భజన మాత్రం వదులుకోరు. పార్లమెంట్ వేదికగా ఆయన సాధించేది ఏమీ లేదని నిన్న మొన్నటి వర్షాకాల సమావేశాలే తేల్చేశాయి. టీఆర్ ఎస్ పై ఆరోపణలు చేయడం మినహా రాష్ట్రానికి ఏం కావాలో అన్నది ఆయన అడగలేకపోయారు అన్న విమర్శ అయితే మూటగట్టుకున్నారు. ఇక టీఆర్ఎస్ కూడా రేవంత్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన తిట్లపై ఇచ్చే కౌంటర్లు మినహా గ్రౌండ్ లెవెల్ లో ఆయ న చెప్పే సినిమా కబుర్లకు పెద్ద సీన్ ఏమీ లేదని తేల్చేస్తుంది. కేసీఆర్ కూడా ఆయనను పట్టించుకోవద్దనే భావిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి