ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల కూడా వైసీపీకి లీడ్ వచ్చినట్లు ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ సీట్లలో వైసీపీ సత్తా చాటేలా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సీట్లలో ఎక్కువ స్థానాల్లో వైసీపీ ఇంతవరకు గెలవలేదు...అలాంటి స్థానాల్లో ఈ సారి వైసీపీ గెలిచేలా ఉంది. ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేల సీట్లలో పార్టీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీ వైపుకు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చిన విషయం తెలిసిందే.
గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, చీరాల నుంచి కరణం బలరాం, గుంటూరు వెస్ట్ నుంచి మద్దాలి గిరి, విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేశ్‌లు వైసీపీ వైపుకు వచ్చారు. అయితే ఈ నాలుగు సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు. కానీ ఈ సారి మాత్రం గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎలాగో వంశీ వైసీపీ టిక్కెట్ మీదే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన గన్నవరం బరిలో సులువుగా గెలిచేలా ఉన్నారు.
అటు చీరాల సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు గానీ..అక్కడ టీడీపీ వీక్‌గా ఉండటం వల్ల, వైసీపీ మాత్రం సత్తా చాటేలా ఉంది. విశాఖ సౌత్‌లో వాసుపల్లి వైసీపీ నుంచి బరిలో నిలబడి గెలిచేలా ఉన్నారు. ఇక గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరికే కాస్త డౌట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే వెస్ట్‌లో టీడీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. మొత్తానికైతే మూడు టీడీపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడేలా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి