తరచూ ఈ మధ్యకాలంలో ఏపీలో కూడా ఏదో ఒక హత్య సంఘటనలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా విశాఖలో దంపతుల దారుణ హత్య ఒక్కసారిగా అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురైయ్యేలా చేస్తోంది. ఈ దారుణమైన ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ హత్య జరిగిన తరువాత 24 గంటలకు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. మరణించిన వారిలో రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు ,ఆయన భార్య లక్ష్మి.


అయితే కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేసి ఇంటికి తాళాలు వేసి పారిపోయారని పోలీసులు గుర్తించారు.యోగేంద్ర బాబు మేనల్లుడు ఇంటికి వెళ్లి చూడగా రక్తపుమడుగులలో ఈ దంపతులు ఉండడంతో వెంటనే పోలీసులను సైతం ఆశ్రయించి సంఘటన స్థలానికి తీసుకువెళ్లాడట. అయితే తాళాలు పగలగొట్టి లోపల చూడగా ఒక రూమ్ లో ఈ దంపతులు ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఈ హత్య ఎవరు చేసారు? ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారట.


ప్రస్తుతం పోలీసులు ఆధారాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకోసం డాగ్ స్క్వాడ్, క్లుస్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంటి చుట్టూ పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారట.హత్యకు గల కారణాలు ఇంకా తెలియడం లేదని తెలుపుతున్నారు. ఈ కేసును పలు రకాల కోణాలలో దర్యాప్తు చేస్తున్నారట. అయితే ఈ హత్య గురువారం సాయంత్రం 7:30 నిమిషాల సమయంలో అరుపులు వినిపించాయని కానీ అవి భార్యాభర్తల గొడవలు అన్నట్లుగా భావించి అక్కడ ఉండే స్థానికులు వెళ్లలేదని తెలియజేశారు. ముఖ్యంగా గురువారం అందరూ కూడా గ్రామ దేవత పండుగ హడావిడిలో ఉండడం చేత ఇంట్లో దూరి దుండగులు ప్రవేశించి మరి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు అయినప్పటికీ వీరు అమెరికాలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: