పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్ 1 అమలు చేయడంలో సక్సెస్ అయిన మోడీ ప్రభుత్వం రెండో పార్ట్ కోసం కూడా సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టికరించనుంది. అవసరమైతే పాకిస్తాన్ పై యుద్ధం కూడా చేయబోతోంది. అయితే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ మొత్తం ఈ దాడుల్లో మరణించింది.


 ఇండియా మిస్సైల్ల దాడిలో అజార్ ఫ్యామిలీ మొత్తం చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పదిమంది కుటుంబ సభ్యులు అలాగే ఆయన అనుచరులు నలుగురు మొత్తం మరణించారని తెలుస్తోంది. ఇక మృతులలో మసూద్ అజార్ సోదరి అలాగే బావ కూడా ఉన్నట్లు సమాచారం. బహవల్పూర్ లోని జైషే  హెడ్ క్వార్టర్స్  పైన భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే అతడు ఉంటున్న హెడ్ క్వార్టర్స్  మొత్తం కుప్పకూలింది.

 ఇక ఈ దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ సంచలన లేఖ కూడా విడుదల చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారని ఫైర్ అయ్యాడు. నాకు భయం లేదు, నిరాశే లేదు విచారం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఇండియాను నాశనం చేసి ప్రధికారం తీర్చుకుంటానని మసూద్  వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ లేఖ వైరల్ గా మారింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: