
అయితే ఈ పథకం అమలు పైన ప్రతిపక్షాలు సైతం ఎన్నోసార్లు విమర్శలు కూడా చేశారు.. మరి ఇప్పుడు తాజాగా ఈ రోజున తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా వారికి సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉండడం వల్ల గత ఏడాది తల్లికి వందనం పథకాన్ని వేయలేకపోయామని అందుకే ఈసారి స్కూల్స్ ఓపెన్ అయిన వెంటనే తల్లుల ఖాతాలో జమ చేయబోతున్నామంటూ తెలిపారు. ఒకానొక దశలో రెండు విడతలుగా కూడా ఈ పథకాన్ని అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా వినిపించాయి. విమర్శలు ఎక్కువగా వినిపించడంతో ఒకేసారి వేయబోతున్నారు.
అయితే తల్లుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయాలి అంటే ముందుగా తల్లులు వారి పిల్లల యొక్క వివరాలను హౌస్ హోల్డ్ మ్యాప్ లో నమోదు చేసుకోవాలని ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకుంటే దగ్గర్లో ఉండే సచివాలయానికి వెళ్లి చేయించుకోవాలని తెలిపారు. అలాగే తల్లుల బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డు లింక్ చేయాలని కూడా తెలిపారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలకు పథకాలను అమలు చేసి సమాధానం చెప్పేలా చేయాలని భావిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో ముందుకు వెళ్లాలని అటు టిడిపి కార్యకర్తలు నేతలు కోరుకుంటున్నారు.