తెలుగు బుల్లితెర పై, వెండితెరపై కడుపుబ్బ నవ్వించే కమెడియన్ గా పేరు సంపాదించిన హైపర్ ఆది గురించి చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ షో ద్వారా భారీ క్రేజీ సంపాదించుకొని పలు చిత్రాలలో కమెడియన్ గా నటించారు. ఈ మధ్యకాలంలో పలు షోలలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్న హైపర్ ఆది తనదైన స్కిట్లతో జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా అదరగొట్టేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో సందడి చేస్తూ ఉన్నారు. హైపర్ ఆది స్కిట్ లలో అమ్మాయిలను చులకనగా చూపిస్తూ ఉంటారని , డబల్ మీనింగ్ డైలాగులు ఉపయోగిస్తూ ఉంటారని చాలామంది విమర్శలు కూడా చేశారు గతంలో.


కానీ మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ పైన వీరాభిమానని చూపిస్తూ ఉంటారు హైపర్ ఆది. 2024 ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. అంతేకాకుండా ఆ సమయాలలో జబర్దస్త్ షో గా ఉన్న జడ్జి, వైసీపీ నేతగా ఉన్న మంత్రి రోజా పైన హైపర్ ఆది విమర్శలు చేశారు. అయితే ఆ ఎన్నికలలో రోజా ఓడిపోయాడం జరిగింది. ఆమె ఓడిపోవడం కంటే జబర్దస్త్ షోలో కమెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువగా జరిగిందనే విధంగా వినిపిస్తూ ఉంటాయి.


అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ఇంటర్వ్యూలో హైపర్ ఆది రోజా గురించి మాట్లాడారు.. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా గారిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా?.. అందుకు హైపర్ ఆది మాట్లాడుతూ రోజా గారికి జగన్ అంటే ఎంత ఇష్టమో నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే అంతే ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి.. రోజా గారు అంటే తమకు ఎప్పుడు గౌరవమే.. నాకు ఇంత పేరు రావడానికి కూడా రోజా గారు ఒక కారణం అంటూ వెల్లడించారు. రాజకీయాలను పక్కన పెడితే.. ఆమె పైన నాకు కూడా ఎప్పుడు గౌరవం ఉంటుందంటూ తెలిపారు హైపర్ ఆది.

మరింత సమాచారం తెలుసుకోండి: