అక్టోబరు నెలలో ఆస్ట్రేలియా వేదిక జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఇక అన్ని జట్లు సిద్ధమయ్యాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసిసి నిబంధనల ప్రకారం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు టి20 వరల్డ్ కప్ ఆడబోయే తమ జట్ల వివరాలను ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే  పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి అన్ని జట్లు కూడా. ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్కప్ లో విజయం సాధించడమే లక్ష్యంగా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఇప్పటికే బిసిసిఐ టి20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టు వివరాలను ప్రకటించారు.



 అయితే ఇప్పుడు భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టు ప్రకటన కూడా జరిగింది. ఇటీవలే ఆ దేశ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా వరల్డ్ కప్ ఆడబోయే పాకిస్థాన్ జట్టును ప్రకటించింది అని చెప్పాలి. అదేసమయంలో ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ కు సంబంధించిన జట్టు కూడా ప్రకటన చేసింది అని చెప్పాలి.   ఇంగ్లండ్‌తో సిరీస్‌ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయగా.. ఇందులో అమీర్‌ జమీల్‌, అర్బర్‌ ఆహ్మద్‌, మహ్మద్‌ హారిస్‌ వంటి యువ ఆటగాళ్లకు మొదటిసారి పాకిస్థాన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.


 ఇక పాకిస్తాన్ టి20 ప్రపంచకప్కు సంబంధించి జట్టు విషయానికి వస్తే 15 మంది సభ్యులతో ప్రధాన జట్టుతో పాటు ముగ్గురు స్టాండ్బై ప్లేయర్లను కూడా ప్రకటించింది. గాయం కారణంగా ఇటీవలి ఆసియా కప్ కు దూరమైన స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు అని తెలుస్తోంది. యువ ఆటగాడు హైదర్ అలీ కూడా జట్టులో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ కు సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు.

టీ20 ప్రపంచకప్‌కుపాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్.

మరింత సమాచారం తెలుసుకోండి: