ఇటీవల కాలంలో భారత క్రికెట్లో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. ఒక ఆటగాడు గాయపడిన అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం బీసీసీఐ ముందు ఎన్నో ఆప్షన్లో ఉంటున్నాయి.  ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో తెరమీదకి వస్తూ ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇక ఆ తర్వాత కాలంలో తక్కువ సమయంలోనే టీమిండియాలో చోటు సంపాదించుకుంటూ నిలదొక్కు కుంటున్నారు అని చెప్పాలి.


ఇక అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఆటగాళ్లలోని ప్రతిభను వెలికి తీసేందుకు బీసీసీఐ ఇటీవలే రూల్స్ లో ఎన్నో మార్పులు తీసుకువస్తూ ఉంది. ఈ క్రమంలోనే తీవలే ఇంపాక్ట్ ప్లేయర్ అనే పేరుతో కొత్త రూల్ తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ ఫీల్డింగ్ చేయడం మాత్రమే కాదు బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది జట్టు కెప్టెన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే బిసిసిఐ తీసుకొచ్చిన ఈ రూల్ ప్రకారం తొలి ఇంపాక్ట్ ప్లేయర్ గా నిలిచిన రికార్డును ఒక యువ ఆటగాడు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు ఆటగాడి పేరు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



ఢిల్లీ ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకిన్ భారత్ టీ20 క్రికెట్లో మొట్టమొదటి ఇంపాక్ట్ ప్లేయర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్లో ఓపెనర్ హితెన్ దలాల్ స్థానంలో హృతిక్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా హృతిక్ షోకిన్ రెండు వికెట్లతో అదరగొట్టాడు అని చెప్పాలి. కీలక సమయంలో ప్రత్యర్ధుల వెన్ను విరిచాడు.  కాగా ఈ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ జట్టు 71 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇక ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా హృతిక్ షోకిన్ సుపరిచితుడుగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: