ఇందులో భాగంగా మొబైల్ బ్యాటరీ డేటాను త్వరగా ఖాళీ చేస్తున్న కొన్ని యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు యూసర్లు కూడా వెంటనే ఆ యాప్‌లను డిలీట్ చేయాలని టెక్ దిగ్గజ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆ యాప్ ల వల్ల ముఖ్యంగా చార్జింగ్ చాలా స్పీడ్ గా అయిపోతుందట. గూగుల్ 16 యాప్ లు యూజర్లు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే.. ఒక రిక్వెస్ట్ సహాయంతో ఒక రిమోట్ కాన్ఫిగరేషన్‌ను డౌన్లోడ్ చేస్తాయి ఆ తర్వాత మరికొన్ని సహాయంతో డెవలపర్ యూజర్లకు తెలియకుండానే బ్యాగ్రౌండ్ లో పలు వెబ్సైట్లు ఓపెన్ చేసి పలు యాడ్స్ పైన క్లిక్ చేస్తూ ఉంటాయి.
ఇదంతా మొబైల్ ఉపయోగిస్తున్న యూజర్లకు తెలియకుండానే జరుగుతుందని టెక్ దిగ సంస్థలు తెలుపుతున్నారు. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోవడమే కాకుండా డేటా త్వరగా అయిపోతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలుపుతోంది. నిషేధించబడిన యాప్స్ విషయానికి వస్తే.. జామ్ కోడ్, బుసాన్బస్, కరెన్సీ కన్వర్టర్, హై స్పీడ్ కెమెరా, ఫ్లాష్ లైట్, ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడర్, మెమో క్యాలెండర్ తదితర యాప్స్ ఈ జాబితాలో ఉన్నాయి వీటిని మొబైల్ లో ఉంటే డిలీట్ చేయడం మంచిది.