సాధారణంగా ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసేవారు టాక్టర్ తో పొలం దున్నుతు ఉంటారు. అందుకు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక ఇంజనీర్ గంటకు రూ.10 ఖర్చుతో పొలం దున్నే ట్రాక్టర్ ను తయారు చేయడం జరిగింది. రైతుల నుంచి సలహాలు, సూచనలు ,స్వీకరిస్తూ పలు ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసిన ఆర్ అండ్ డి హబ్స్ లో ట్రాక్టర్లు అభివృద్ధి చేస్తున్నారు. అయితే రైతుగా మారిన ఇంజనీర్ నికుంజ్ కొరట్ దానికి భిన్నంగా పంట పొలాలలో మారుత్ ఈ ట్రాక్టర్ 3.0 పేరుతో ఒక బుల్లి ట్రాక్టర్ ను డెవలప్ చేస్తున్నారు.


ఈ ట్రాక్టర్ ను అభివృద్ధి చేయడానికి గుజరాత్ లో నికుంజ్ బ్రదర్స్ సుమారుగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం. తాజాగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ (ICAT) సర్టిఫికెట్ కూడా రావడం జరిగింది. పొలాలు దున్నడానికి కేవలం గంటకు రూ.10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే చాలట రైతులకు అందుబాటులో తేవడానికి దీని ధర రూ.5.5 లక్షల ధర పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిని కమర్షియల్ లైసెన్స్ కోసం నిధులు సాయం చేయాలని ఇన్వెస్టర్లు మద్దతు ఇవ్వాలని సేమ్ సబ్సిడీ ఇవ్వాలని నికుంజ్ కోరుతున్నారు.

ఈ ట్రాక్టర్ 3.0 కేవలం నాలుగు గంటలలో చార్జింగ్ అవుతుందని తెలిపారు ఇది చిన్న డీజిల్ ట్రాక్టర్ మాదిరిగా ఉంటుందని తెలియజేశారు. ఈ ట్రాక్ట్ 3.0 తయారీలో తమ సొంత గ్రామ రైతుల నుంచి కొన్ని సలహాలు తీసుకున్నామని నికుంజ్ తెలియజేశారు. దీన్ని కొనుగోలు ఖర్చు కూడా కాస్త ఎక్కువగానే అయినా డీజిల్ తో పోలిస్తే పదవ వంతు ఖర్చు మాత్రమే సరిపోతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా లిథియం ఐరన్ ఫాస్పేట్ ట్రాక్టర్ రూ.2.5 లక్షల కే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు రూ.10 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని కొంచెం తెలియజేస్తున్నారు. ఈ ట్రాక్ట  సబ్సిడీ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వీటిని మరింత విస్తరింప చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: