పోకో ఇండియాలోనే అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ మొబైల్ బ్రాండ్లలో ఇది కూడా ఒకటి. తాజాగా పోకో c-55 మొబైల్ ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ప్రీమియంగా కనిపించే లేథరేట్ బ్యాక్ ఉన్నప్పటికీ.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సౌకర్యమైన ధరలకే లభిస్తోందట. ఒక మీడియా టెక్ హీలియం G85 SOC,6GB ram మరియు 128 GB స్టోరేజ్ మెమొరీ కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి..6.71 అంగుళాలు కలదు. ఈ నెల చివరిన ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి రాబోతోంది.


పొకో C-55 మొబైల్ ధర స్పెసిఫికేసన్ విషయానికి.. ఈ మొబైల్ రెడ్మీ 12 -C మొబైల్ కు రీ బ్రాండెడ్ వర్షన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది . రెడ్మీ మొబైల్ ఈ నెలలో ఇండియాలో లాంచ్ చేయబడుతుందని వార్తలు వినిపించాయి. redmi 12-C మొబైల్ ఇప్పటికే చైనాలో అనేక మార్కెట్లలో ఈ మొబైల్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. POCO C-55 స్మార్ట్ మొబైల్ 1650X720 పిక్సెల్ తో కలదు. అలాగే 5MP ఫ్రంట్ కెమెరాతో పాటు ఫేసింగ్ కెమెరా కూడా కలిగి ఉంటుంది.


డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో 50 mp ప్రైమరీ కెమెరా కలదు. ఈ మొబైల్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది అలాగే బ్యాటరీ విషయానికి వస్తె..5000 MAH సామర్థ్యంతో కలదు. ఈ మొబైల్ పోకో C-55 కనెక్టివిటీ ఎంపికలోని 3.5 MM ఆడియో జాక్ డ్యూయల్ ఫోర్ జి ఓల్ట్, బ్లూటూత్ జిపిఆర్ఎస్ కలదు. ఈ స్మార్ట్ మొబైల్ ధర ప్రారంభం రూ.9,499 రూపాయలకే కలదట. గేమింగ్ యూజర్లకు అత్యంత మరియు అత్యంత శక్తివంతమైన స్మార్ట్ మొబైల్ గా పేరు పొందినట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఈ మొబైల్ ని తీసుకుంటే రూ.1000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: