ఈ మధ్యకాలంలో  సీరియల్ హవా ఎక్కువ అవుతున్న విషయం తెలిసినప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సీరియల్స్ కి ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ టీవీ లో ఎనిమిది గంటలు అయితే చాలు మహిళలు వచ్చి టీవీ ముందు వాలిపోతారు.. అంతలా  బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి సీరియల్స్. రిన్ ప్రియరాగాలు , హార్లిక్స్ హృదయాంజలి సన్రైస్ నాడు-నేడు వంటివి ప్రతి రోజు రాత్రి 8 గంటల సమయంలో మొదలయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే 2000 సంవత్సరం నుంచి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు శాంతినివాసం అని డైలీ సీరియల్ ప్రసారం అయ్యేది.

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సీరియల్ మొదలైంది. ఇప్పుడు సెలబ్రిటీలు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ , రాజీవ్ కనకాల, ఝాన్సీ, రంగనాథ్ , పావని తదితరులు నటించారు.. ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా ఎపిసోడ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సీరియల్ ప్రతిరోజు సోమవారం నుండి గురువారం వరకు ప్రసారం అయ్యేది.

2001వ సంవత్సరంలో చదరంగం అనే సీరియల్ రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ పూర్తయిన తర్వాత అన్నయ్య సీరియల్ స్టార్ట్ చేశారు. అచ్యుత్, సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు. 2003వ సంవత్సరంలో ప్రియాంక అనే డైలీ సీరియల్ ప్రసారం అయ్యేది. ఇక ఇందులో చక్రి ,ఫాతిమా బాబు , అబిత, మహర్షి, శ్రీ కృష్ణ కౌశిక్ వంటి వారు నటించారు. ఇక 2005లో అగ్నిగుండం సీరియల్ స్టార్ కాగా ఈ సీరియల్ కు రచన-దర్శకత్వం సుమన్ అందించారు. 2006లో ఆడపిల్ల సీరియల్ స్టార్ట్ అయింది. ఆడపిల్ల సీరియల్ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోవడంతో చంద్రముఖి సీరియల్ ప్రసారం చేశారు.

ఇక 2013 వరకు ఈ సీరియల్ నడిచింది . తర్వాత 2013 లో స్వాతి చినుకులు సీరియల్ ప్రసారం చేశారు .ఇక మొన్నటి వరకు చాలా బాగా ప్రసారం అయిన ఈ సీరియల్ ముగియడం తో 2020లో యమలీల సీరియల్ ను ప్రసారం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: