
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుంది. 2జి నెట్వర్క్ నుంచి మొదలు 5జి నెట్వర్క్ 6జి నెట్ వర్క్ వైపు అడుగులు వేసే విధంగా ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఈ నెట్వర్క్ చాలదన్నట్టు చాలావరకు వైఫైలు కూడా వచ్చాయి. అయితే ఇంతవరకు మనకు మొబైల్ ఫోన్ లో కానీ లాప్ టాప్ లో ఇతర ఇంటర్నెట్ ను వాడే పరికరాలకు నెట్ సిగ్నల్ అనేది టవర్స్ నుంచి వచ్చేది. లేదంటే ఒక వైఫై రూటర్ పెట్టుకుంటే దాని నుంచే ఆ సరౌండింగ్ మొత్తం సిగ్నల్స్ వచ్చేవి. ఒక ఆఫీస్ లో మనం రూటర్ అమరిస్తే ఒక రూమ్ లో సిగ్నల్ ఎక్కువగా ఉండేది,మరో రూంలో సిగ్నల్స్ తక్కువగా ఉండే సమస్యలు ఉండేవి. అలాంటి ఈ తరుణంలో వైఫై లాగానే మరో సిగ్నల్ సంస్థ వచ్చింది. దాని పేరే లైఫై.. దీన్ని గుజరాత్ కు చెందిన నావ్ వైర్లెస్ టెక్నాలజీస్ వారు అభివృద్ధి చేస్తున్నారు..