ఆపరేషన్‌కు జస్ట్ 24 గంటల ముందు మాత్రమే మిలిటరీ టీంకు ఆదేశాలు అందాయి. ఇవి అందిన వెంటనే వారు గుట్టుచప్పుడు కాకుండా పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన్ని చేరుకున్నారు. గంటల వ్యవధిలో సైలెంట్‌గా అక్కడి వ్యూహాత్మక స్థావరాలను కైవసం చేసుకున్నారు. అదే సమయంలో.. చైనాకు అనుమానం రాకుండా ఉండేందుకు భారత మిలిటరీ ఎప్పటిలాగే తన సైనిక కార్యకలాపాలను కొనసాగించింది.

లెఫ్టెనెంట్ జనరల్ సవ్‌నీత్ సింగ్ ఆధ్వర్యంలో 14 కోర్‌కు చెందిన ఓ బృందం ఈ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. దీంతో అక్కడి కైలాష్ పర్వత సానువులు భారత్ ఆధీనంలోకి వచ్చింది. ఆగస్టు 29-30 మధ్య జరిగిన ఈ ఆపరేషన్ లద్దాఖ్‌ ఉద్రికత్తలను కీలక మలుపు తిప్పింది. చర్చల్లో పాల్గొంటూ కూడా వార్ వన్ సైడ్ అన్నట్టు వ్యవహరిస్తున్న చైనాకు చెక్ పెట్టేలా.. మొండిపట్టుదల విడనాడేలా చేసేందుకు భారత్‌కు ఓ అస్త్రం దొరికింది.

చైనా మైండ్ సెట్ అర్థం చేసుకున్న భారత్‌ తన రక్షణాత్మక వైఖరి విడనాడింది. ఓ కొత్త మిలిటరీ ఆపరేషన్‌కు నాంది పలికింది. ఆర్మీకి చెందిన మౌంటెన్ స్ట్రైక్ కోర్‌తో పాటు, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, పారా ఎస్‌ఎఫ్ దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. వారి ముందు ఉన్నది ఒకటే లక్ష్యం.. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని వ్యూహాత్మక స్థావరాలను ఎలాగైనా కైవసం చేసుకోవడం. ఇవి భారత్ ఆధినంలోకి వస్తే.. చైనా చర్యలపై నిఘా పెట్టడమే కాకుండా.. అవసరమైతే యుద్ధసమయంలో భారీ దాడులకు కూడా దిగవచ్చు. ఈ ప్లాన్ వివరాలు బయటకు పొక్కకుండా కేంద్రం అత్యంత గోప్యత పాటించింది.


ఇదిలా ఉంటే ఆగస్టులో భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రక్తతలపై సమావేశాలు జరిగాయి. అయితే చైనా తన మొండి పట్టుదల వదలలేదు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న చైనా.. వెన్కక్కు తగ్గేది లేదని భీష్మించుకు కూర్చుంది. ఉద్రిక్తతలు చల్లార్చేందుకు చర్చలు ప్రారంభమైతే.. అక్కడా తన మాటే చెల్లాలని, మొండి పట్టు పట్టింది. దీంతో చైనా ప్లాన్ భారత్‌కు బోధపడింది.

అంతే.. చైనా స్పీడుకు బ్రేకులు వేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంది. ప్లాన్ ప్రకారం పాంగాంగ్ సరస్సు దక్షిణ బాగంలో పాగా వేసింది. ఇప్పటివరకు భారత్‌కు షాకిచ్చామనుకుంటున్న చైనాకు భారత్ ఊహించని ఎదురుదెబ్బతో కళ్లు తిరిగినంత పనైంది. ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: