నిన్నటి రోజున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏబీఎన్ రాధాకృష్ణతో కలిసి డెబిట్ లో పాల్గొన్నారు.. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాల గురించి పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది.. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవడానికి పలు రకాల వ్యూహాలను రచిస్తున్నారు చంద్రబాబు.. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా అక్కడ జరిగిన జైలులో కొన్ని సంఘటనలను డెబిట్ లో తెలియజేశారు. అందులో తనను చంపడానికి కుట్ర చేశారంటూ కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు వాటి గురించి తెలుసుకుందాం.


చంద్రబాబు 50 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు తనకు పనుకోవడానికి మంచం ఇవ్వలేదని.. కమోడ్ లేనటువంటి టాయిలెట్ ఇచ్చారని.. అలాగే టాబ్లెట్లు కూడా ఇవ్వలేదు.. కూర్చి కూడా ఇవ్వలేదు.. గదినిండా దోమలు, చమట చన్నీళ్లు తాగడానికి ఇచ్చేవారు.. ముఖ్యంగా ఇవన్నీ చూసి ఆనందపడాలని జగన్ సీసీ టీవీ కెమెరాలను కూడా బిగించారంటూ తెలియజేశారు.. ముఖ్యంగా తను ఉంటున్న జైలు మీద డ్రోన్ కెమెరాలు వంటివి ఎగరేయడం వంటివి చేశారంటూ తెలియజేశారు చంద్రబాబు.. అలా ఆ విధంగా తనను చంపడానికే ప్రయత్నాలు చేశారని కూడా తెలుపుతున్నారు.


ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి.. ఇంటలిజెన్స్ అధికారులు ఫోన్ చేసి తెలుసుకునే వారని కూడా తెలుపుతున్నారు. చంద్రబాబు కూడా తన చేతుల్లో ఏముందని ఏం జరుగుతుందో జరగనీలే అని ధైర్యంగా ఉన్నానంటూ వెల్లడించారు.. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబును జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చారట.. కానీ తానేమి చేయగలను అంటూ కూడా తెలియజేశారు. కానీ తన ధైర్యంతో ఒక్కడినే జైలు లోపల ఉన్నానని వెల్లడించారు. సెక్యూరిటీ పరంగా అయితే అంత ఓకే అని కూడా వెల్లడించారు. ముఖ్యంగా డ్యూటీ కానీ భయం కానీ రెండు ఉండేవి అని తెలిపారు చంద్రబాబు.  తన ఆరోగ్య సమస్యలను కూడా తారుమారు చేశారని తెలియజేస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదని తెలిపారు.. అడుగడుగున ఎదురైనా ఈ సమస్యలన్నీ కూడా తనని చంపడానికి అన్నట్టుగా కనిపించాయని తెలిపారు. అయితే తనను తన భార్య నారా భువనేశ్వరి కాపాడిందంటూ పరోక్షంగా వెల్లడించారు. 50 రోజుల పాటు జైలులో ఉన్నప్పుడు తన భార్య నారా భువనేశ్వరి మహిళలతో కలిసి చేసిన పోరాటం వల్లే తాను తొందరగా బయటపడాలని ఆ నారీ శక్తే తనను కాపాడింది అంటూ వెల్లడించారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: