ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ ఏపీ ఎన్నికల్లో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అవును... వైసిపి, టిడిపి కూటమి మధ్య నువ్వా నేనా? అన్న మాదిరి పోటీ నెలకొంది. అధికార పార్టీ అధినేత జగన్ తన అధికారం దక్కించుకోవడం పైన పూర్తి విశ్వాసంతో ఉండగా కూటమి ఈసారి విజయం తనదే అన్న ధీమాని వ్యక్తం చేస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను జగన్ తనకి అనుకూలంగా మలుచుకుంటున్నట్టు కనబడుతోంది. కీలకమైన పోలింగ్ వేళ ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో ఈనెల 13న పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో జగన్ తన ప్రతి ప్రచార సభలో తన హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, గతంలో బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో 3 పార్టీల కూటమి కలయిక గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజమండ్రి సభలో ప్రధాని మోడీ వైసీపీ ప్రభుత్వం పైన పలు ఆరోపణలు చేయగా దీనికి స్పందించిన జగన్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో ఢిల్లీ పీఠాన్ని కదిలిద్దామంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. అవును, జగన్ తొలినుంచి పూర్తిగా సంక్షేమ ఓట్ బ్యాంకు పైనే నమ్మకం పెట్టుకున్నట్టు ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో జగన్ కంటే తాను మెరుగైన సంక్షేమం పెద్ద సంఖ్యలో పథకాలు అందిస్తానంటూ చెప్పుకోవడం జగన్ పాలిట ఇపుడు వరమైంది. చంద్రబాబు చెప్పిన ఏది అమలు చేయరని, అది ఇపుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్పుకొస్తున్నారు జగన్. ఏప్రిల్, మే నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో జరిగిన గందరగోళానికి చంద్రబాబు కారణమని వైసిపి బలంగా ఆరోపణ చేస్తోంది. దాంతో లబ్ధిదారులు చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఇప్పుడు పథకాల విషయంలోనూ అదే జరుగుతుంది. దీంతో ప్రతి పథకంలోనూ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని వైసిపి అంచనా వేస్తుంది. మరి తుది ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: