జీవితంలో ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టిన సమయంలో ఆ పని కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆ పనిని ఇష్టంతో చేస్తే విజయం సులభంగా సొంతమవుతుంది. ఏ పని చేయాలన్నా ఉసూరుమంటూ ప్రారంభిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బద్ధకం మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడాలి. 
 
ఏ పనినైనా ఇష్టంతో చేస్తే ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది. జీవితంలో విజేతలుగా నిలిచిన వారంతా కష్టమైన పనులను ఇష్టంతో చేస్తూ విజయం సాధించారు. మన పనిని మనం అదనపు భారంగా భావించకుండా లక్ష్యాన్ని సాధించాలనే తపన, ఉత్సాహంతో ముందుకు సాగితే పనిలో కష్టం కాకుండా ఇష్టం మాత్రమే కనిపిస్తుంది. 
 
జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించాలంటే నిరంతరం కష్టపడాలి. కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. లక్ష్యాన్ని ఇష్టంతో ప్రేమిస్తే సాధించాలన్న తపనే ముందుకు నడిపిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇష్టంతో చేస్తే చేపట్టిన పనిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా విజయవంతంగా పని పూర్తవుతుంది. అలా ఇష్టపడి పని చేసుకుంటూ పోతే పనులు చకచకా సాగిపోవడంతో పాటు చేయగా చేయగా పనులు సులభమతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: