ప్రతి ఒక్కరూ మనకు లభించిన జీవితంలో చాలా సంతోషంగా మరియు సౌకర్యవంతంగా బ్రతకాలనుకుంటారు. అయితే ఇలా బ్రతకడానికి మనకు సరైన వనరులు కావాలి. వాటిలో ముఖ్యంగా డబ్బు. ఏదైనా పని చేసో లేదా జాబ్ లేదా వ్యాపారం చేసి డబ్బు సంపాదించి మనము సంతోషంగా బ్రతుకుతాము. ఇలా మంచి జీవితాన్ని పొందాలంటే మనకు కనీస జ్ఞానం మరియు ఆలోచన శక్తి అవసరం. వీటి కోసం చిన్నప్పుడు మన తల్లితండ్రులు చదివిస్తారు. చిన్నప్పటి నుండి మనము కూడా కష్టపడి చదువుకుంటాము. అనుకోకుండా టెన్త్ క్లాస్ లోనో లేదా ఇంటర్ మీడియట్ లోనో ఫెయిల్ అయితే తరువాత ఏమిటి ? మీ లైఫ్ అక్కడితో అయిపోతుందా ? లేదా ఇక జీవించడానికి మార్గాలే లేవా ? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను మరియు అందమైన వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యులే. చదువంటే ఈ సమాజములో బ్రతకడానికి  ఖచ్చితంగా కావలసిన ఒక లైసెన్స్ కాదు. ఈ విషయాన్ని తల్లితండ్రులు తెలుసుకుని, మీ పిల్లలకు చదువు యొక్క అవసరాన్ని, విలువను అర్థమయ్యేలా చెప్పాలి. అంతే కానీ ర్యాంకులు కోసం పక్కింటి వారితో పోల్చి తిడుతూ ఉంటే ఇలాంటి సంఘటనలే జరుగుతుంటాయి. మరియు వారికి చదువును బోధించే ఉపాధ్యాయులు కూడా వారిని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఫెయిల్ అయితే నిందించకుండా వారికి దైర్యం చెప్పాలి. అటువంటి విద్యార్థులందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. చదువులో ఫెయిల్ అయితే జీవితం అంతటితో ఆగిపోదు.

ఈ విషయాన్ని గట్టిగా ఫిక్స్ అయిపోండి. ఈ సమాజంలో చదువు లేకుండా బ్రతకడానికి చాలా అవకాశాలున్నాయి. మీలో ఉన్న ఆలోచనలే చదువు అని తెలుసుకోండి. మీలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టి ముందుకు సాగండి. మిమ్మల్ని ఎవ్వరూ విజయం నుండి దూరం చేయలేరు. కాబట్టి జీవితం విలువ తెలుసుకుని ఇలాంటి అఘాయిత్యాలకు దూరంగా ఉండండి.


మరింత సమాచారం తెలుసుకోండి: