ఏపీ సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అంటున్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ లేఖ రాశారు. విశాఖ రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న రఘురామరాజు... ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.


న్యాయస్థానంలో ఒకవైపు కేసు విచారణ జరుగుతుండగా ముఖ్యమంత్రి కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నియమ నిబంధనల ప్రకారం ఇది కోర్టు ధిక్కరణకు ఉల్లంఘనకు పాల్పడినట్లుగానే ఉందని.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విధంగానే ఉన్నాయని.. కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సీజేఐకి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: