ప్ర‌పంచం ఇప్పుడు రెండే రెండు విష‌యాల గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటోంది. ఒకటి క‌రోనా వైర‌స్‌.. మ‌రొక‌రి ఉత్త‌ర‌కొరియా అధినేత కిమ్‌కు సంబంధించిన అంశాల గురించి. మొన్న‌టి వ‌ర‌కు కిమ్ ఉన్నాడా.. అస‌లున్నాడా..? అంటూ ఒక‌టే చ‌ర్చ‌.. ఎట్ట‌కేల‌కు 20 రోజుల‌కు క‌నిపించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చాడు. ఇప్పుడు అస‌లు ఆయ‌న నిజ‌మేనా..?  డూపా..? అంటూ మ‌ళ్లీ చ‌ర్చ‌. ఇదిలా ఉండ‌గానే.. కిమ్‌కు సంబంధించిన మ‌రో కొత్త ముచ్చ‌ట వైర‌ల్ అవుతోంది. ఉత్త‌ర‌కొరియాను క‌రోనా వైర‌స్ కంటే.. ఎక్కువ‌గా ఆఫ్రిక‌న్ స్వైన్‌ ఫ్లూ వేధిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏమిటీ ఆఫ్రిక‌న్ స్వైన్‌ ఫ్లూ అంటే.. పందుల‌కు సోకుతుంద‌ట‌. వాటి నుంచి మ‌నుషుల‌కు కూడా సోకే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌. అయితే.. ఉత్త‌ర కొరియా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా పందుల పెంప‌కం చేప‌డుతారు. దాదాపుగా ప్ర‌తీ కుటుంబం పందుల పెంప‌కం చేప‌డుతోంది.

 

అంతేగాకుండా.. అక్క‌డి ప్ర‌జ‌ల ఆహారంలో ఈ పందులే అత్యంత కీల‌కం. అయితే.. ఇప్పుడు ఈ పందులు ఎక్కువ‌గా అంటే దాదాపుగా 40శాతానికంటే ఎక్కువ‌గా ఆఫ్రిక‌ల్ స్వైన్ ఫ్లూతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. పందుల నుంచి ప్ర‌జ‌ల‌కు కూడా సోకుతున్న‌ట్లు ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కిమ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పందుల‌న్నింటినీ చంపేయాల‌ని ఆదేశిద్దామంటే.. తీవ్ర‌మైన ఆహార‌సంక్షోభం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని, బ‌య‌టి ప్ర‌పంచం కూడా సాయం చేసే ప‌రిస్థితులు లేవ‌ని కిమ్ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. అలా అనిచెప్పి ఆ పందుల‌ను అలాగే వ‌దిలేస్తే.. అది తీవ్ర‌మైన విప‌త్క‌ర ప‌రిస్థితుల‌కు దారితీస్తుంద‌న్న ఆందోళ‌న‌తో నియంత ఆగ‌మాగం అవుతున్న‌ట్లు అంటున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితుల నుంచి కిమ్ ఎలా బ‌య‌ట‌ప‌డుతారో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: