తెలంగాణ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సాధారణంగా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే పరీక్షల ఫలితాలు ఈ సంవత్సరం జున్ నెలలో విడుదలయ్యాయి. రాష్ట్రంలో వెలువడిన ఇంటర్ ఫలితాలపై పలువురు విద్యార్థుల్లో సందేహాలు నెలకొన్నాయి. 

 

దీంతో ఇంటర్ బోర్డ్ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రత్యేక వెబ్ సైట్ http://bigrs.telangana.gov.in/ ను ప్రారంభించింది. ఎవరికైనా ఫలితాలపై సందేహాలు ఉంటే వెబ్ సైట్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అనంతరం raise grievances అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఏ సబ్జెక్టు మార్కుల విషయంలో సందేహాలు ఉన్నాయో రాయాలి. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లో ఫిర్యాదు పరిష్కారమవుతుంది. స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా ఫిర్యాదు పరిష్కారమైందో లేదో తెలుసుకోవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: