ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. తాజాగా ఓ వ్య‌క్తికి కొవిడ్‌_19 పాజిటివ్ న‌మోదు అయింది. అయితే తొలుత కొవిడ్ నెగిటివ్ గా ఉండ‌డంతో అత‌ను అంత‌గా ప‌ట్టించుకోలేదు. ఆ త‌రువాత ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా న‌మోదు అయిన‌ది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన  34 ఏండ్ల వ్య‌క్తి  ఐర్లాండ్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చేరుకున్నాడు. అయితే తొలుత ముంబ‌యి విమానాశ్ర‌యంలో ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేయించ‌గా అక్క‌డ నెగిటివ్ వ‌చ్చింది.

 ఆ త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చేరుకున్నాక విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌రొక సారి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొవిడ్ పాజిటివ్ న‌మోదు అయింది. వెంట‌నే అనుమానం వ‌చ్చిన వైద్యాధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. దీంతో ఫ‌లితాల‌లో ఒమిక్రాన్ నిర్థార‌ణ అయింది. దేశంలో ముంబ‌యి, ఢిల్లీ, క‌ర్నాట‌క‌, రాజ‌స్థాన్ రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒమిక్రాన్ న‌మోదైన జాబితాలో చేరింది. దేశంలో ఏపీలో వ‌చ్చిన కేసుతో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 34 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఏపీకి చెందిన వ్య‌క్తికి ఒమిక్రాన్ సోకిన‌ట్టు తాజాగా ఏపీ వైద్యారోగ్య‌శాఖ దృవీక‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: