ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువిశాల సుందర సాగర తీరం గల పట్టణం విశాఖపట్నం, ఆ విశాఖలో గత కొన్నాళ్లుగా యువకులు, విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని పలు ముఠాలు డ్రగ్స్ దందా నడిపిస్తున్నాయి. అలాంటి ముఠాలలో ఒక ముఠా చేస్తున్న డ్రగ్స్ దందా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇక డ్రగ్స్ దందా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. ఈ ముఠా విద్యార్థులను, యువకులనే టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఈ డ్రగ్స్ దందాపై నిఘా పెట్టారు.

పక్కా సమాచారంతో శనివారం (నవంబర్ 21న) సర్వేశ్వరరెడ్డి అనే ఇంటర్ స్టేట్ డ్రగ్ స్మగ్లర్‌‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విశాఖపట్నంలో విద్యార్థులు, యువతను టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ ముఠాను బట్టబయలు చేశారు.

అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖర్ అలియాస్ బిల్లా, మైఖేల్ వెల్‌కం, మురళీధర్‌లను అనే ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్ట్ అయిన వారి నుంచి 33కు పైగా ఎల్ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. 27 ఐఎస్‌డీ చిప్‌ల‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బులను బిట్ కాయిన్స్‌గా మార్చి.. ఇంటర్నెట్‌ ద్వారా డ్రగ్స్‌ ఆర్డర్‌ చేస్తున్నారని విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్‌ సిన్హా చెప్పారు. డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు అమ్ముతున్నారని సీపీ అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: