జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని సందర్శించారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రుషి కొండ లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే తప్పేంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇంతకు ముందు కూడా రుషికొండపై భవనం ఉందని..  కొత్తగా ఏమి భవనం నిర్మాణం చేయడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.


పవన్ కల్యాణ్ రాద్ధాంతం వల్ల ఇసమంత ఉపయోగం ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బిజెపిలో టీడీపీ నుంచి వెళ్లిన బృందం వైసీపీ పై ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ  అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ విజయనగరం పర్యటన పైనా స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలోనే పెద్ద టౌన్ షిప్ అక్కడ కడుతున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అది పూర్తి అయ్యే సరికి నాలుగేళ్ళు పడుతుందని మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు.


విశాఖలో ప్రధాని సభ విజయవంతమైందని మంత్రి బొత్స సత్య నారాయణ  చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని..  ప్రభుత్వ విధానాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి స్పష్టంగా చెప్పారని మంత్రి బొత్స సత్య నారాయణ  తెలిపారు. విశాఖ సభ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ మంచి మెసేజ్‌ ఇచ్చారని మంత్రి బొత్స సత్య నారాయణ  తెలిపారు. రుషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్య నారాయణ  మండిపడ్డారు.


రుషికొండపై ఇప్పటికే వెంకటేశ్వరస్వామి ఆలయం ఉందన్న విషయాన్ని మంత్రి బొత్స సత్య నారాయణ  గుర్తు చేశారు. రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుందన్నది  వాస్తవమని... ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటని మంత్రి బొత్స సత్య నారాయణ  మీడియాను ప్రశ్నించారు. రాష్ట్రంపైన, సీఎం వైయస్‌ జగన్‌పైన ఎల్లోమీడియాకు  అక్కసు. ఉత్తరాంధ్రపై వారికి ఎంత అక్కసుందో ప్రజలు తెలుసుకోవాలని... ప్రభుత్వంపై విషం చిమ్మడమే అది పనిగా పెట్టుకుందని మంత్రి బొత్స సత్య నారాయణ  అంటున్నారు.  కేంద్రంతో వైసీపీ సఖ్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని.. బీజేపీలో ఉన్న బీ గ్రూప్‌ టీడీపీ నుంచి వచ్చిన వారిలో ఇంకా టీడీపీ బుద్ధులు, సువాసనలు వారిలో పోలేదని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: