
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఉద్యోగుల పాత్ర కీలకమందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకవేళ్లడం లో ఉద్యోగులు అదే పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇక ముందు కూడా ఇదే తరహాలో పని చేయాలని మంత్రి ఉద్యోగులకు సూచించారు.
ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంతే కాకుండా... ఒప్పంద, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా పీఆర్సీ వర్తింపజేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో ఆడాలంటే... రవీంద్రభారతిలో సమావేశం నిర్వహించుకోవాలంటే.. ఎన్నో ఆంక్షలు ఉండేవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకున్నారు.
కానీ ఇప్పుడు ఒక దరఖాస్తు పెట్టుకుంటే లక్షల రూపాయలు చెల్లించకుండా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదవీ విరమణతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని అనుకుంటే... మళ్లీ లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీతో పెరుగుదల ప్రారంభం అయ్యిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కరువు లేదని... రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.