సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్స్, హైబ్రిడ్ పవర్ ప్లాంట్స్ పై ఎక్కువగా దృష్టి సారించి విద్యుత్ ను తయారు చేయాలనేది భారత్ అనుకుంటున్న ప్లాన్. కానీ ఇప్పటికీ కుదరడం లేదు. బొగ్గు ఆధారితంగానే ఎక్కువగా విద్యుత్ ను ఇప్పటికీ ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్నాం. బొగ్గుతో చేసేలా విద్యుత్ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి కావాలంటే న్యూక్లియర్ పవర్ అనేది కచ్చితంగా అవసరం.


అర్ద రూపాయి, రూపాయికి పవర్ తయారయ్యేది కేవలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ద్వారానే సాధ్యమవుతుంది. రష్యా, చైనాలో అతి తక్కువ ఖర్చుతో వస్తువుల ఉత్పత్తికి కారణం న్యూక్లియర్ పవరేనట. కానీ మన దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు పెడతామంటే వెంటనే కమ్యూనిస్టులు, పౌర హక్కులు, ప్రజా హక్కులు, అడ్డుకుంటారు. ఆయా దేశాల్లో పాలిస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వాలను మాత్రం ఏమి అనరు. కానీ భారత్ లో న్యూక్లియర్ ప్లాంట్లు పెడదామంటే మాత్రం అడ్డుకుంటారు.


బొగ్గు ఆధారిత విద్యుత్ వాడకాన్ని తగ్గించకపోతే వాతావరణంలో తాపం పెరిగిపోతుంది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచు ఖండాలు కరిగిపోతాయి. పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో వర్షాలు పడే చోట ఎండలు, ఎండలు కాచే ప్రాంతాల్లో వర్షాలు పడి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది.


దేశంలో వాతావరణాన్ని కాపాడేందుకు మొత్తం 81 థర్మల్ ప్లాంట్లను భారత్ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ వాటిని మళ్లీ తెరచి థర్మల్ విద్యుత్ వైపు అడుగులు వేస్తోంది. దేశంలో 74 శాతం ఉన్న థర్మల్ వాటా, 2025 నాటికి 69 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. విద్యుత్ వినియోగం ప్రతి రోజు 1,38,973 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. దీనికి అదనంగా ఆరు శాతం వినియోగం పెరుగుతూనే ఉంది. కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో మూసివేసిన థర్మల్ ప్లాంట్లను మళ్లీ తెరిచి అక్కడ విద్యుత్ ను తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: