కన్యాశుల్కం అంటే పెళ్ళి చేసుకునే సందర్భంలో వరుడు వధువుకిచ్చే సొమ్ము లేదా సంపద. ఇది వరకట్నం అనే ఆచారం కన్నా చాలా పాతది. కన్యాశుల్కం అనేది మన సమాజంలో గతంలో ఉన్న ఒక దురాచారం. గురజాడ లాంటి సంఘ సంస్కర్తల సంకల్పంతో ఇది మన భారతీయ సమాజంలో నుండి బయటకు పోయింది. ఇప్పుడు చైనాలో కన్యాశుల్కం అనేది ఒక అతి పెద్ద సమస్యగా పరిగణమిస్తున్నటువంటి పరిస్థితి. స్త్రీలు కట్నం ఇచ్చి పురుషుని పెళ్లి చేసుకోవడం అనేది మన దగ్గర ఉన్న  సంప్రదాయం.


అక్కడ వరుడు లేక వరుడు కుటుంబం పెళ్లి సందర్భంగా, వధువు లేదా వధువు కుటుంబానికి ఎంతో కొంత సొమ్ము కానుక రూపంలో ఇస్తారట. దీన్నే బ్రైడ్ ప్రైస్ లేదా గురజాడ గారి భాషలో చెప్పాలంటే కన్యాశుల్కం అంటారు. ముఖ్యంగా ఈ కన్యాశుల్కం అనేది సాంప్రదాయంగా చైనా జనాల్లో ప్రబలుతుంది. అర్బన్ చైనాలో అంతకు లేకపోయినప్పటికీ రూరల్ చైనాలో అంటే గ్రామీణ చైనాలో ఈ సాంప్రదాయం ఇప్పటికీ బలంగా ఉంది. కాబట్టి అక్కడ ఇలా ఒక సాంప్రదాయంగా కన్యాశుల్కాన్ని ఆచరిస్తూ వస్తున్నారు.


చైనా ప్రభుత్వం లోని కమ్యూనిస్టు పార్టీ 2023 లో విడుదల చేసిన పాలసీ డాక్యుమెంట్ లో ప్రత్యేకించి రూరల్ ఎకానమీపైన కేంద్రీకరించారు. అంటే గ్రామీణ చైనా లో సంపదను, ఇంకా ప్రోడక్టివిటీని ఎలా పెంచాలి, ఇలాంటి అంశాలతో పాటు గ్రామీణ జనాల్లో బాగా ప్రబలుతున్న బ్రైడ్ ప్రైస్ అనే ఈ కన్యాశుల్కాన్ని ఎలా అరికట్టాలి అనేది ప్రధాన అంశంగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.


సాధారణంగా అక్కడ రెండు లక్షల యువాన్స్ ని అంటే 24 లక్షల వరకు కూడా కన్యాశుల్కం పేరుతో ఇస్తారట. అయితే ఈ మధ్యన అక్కడ ఒక పెళ్ళికొడుకు 8లక్షల 80వేల యువాన్స్ ని ఇవ్వాల్సి రావడం వివాదంగా మారింది. దాంతో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: