బంగారం ధరలు ఎలా ఉంటున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. కేవలం అంటే కేవలం ఒక సంవత్సరంలో ఏకంగా 14 వేలకుపైగా పెరిగింది.. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు... తగ్గినట్టు కనిపిస్తుంది.. కానీ తగ్గలేదు.. తగ్గినట్టు తగ్గి మళ్లీ రోజే బంగారం ధర దారుణంగా పెరుగుతుంది.. ఇప్పుడు చూస్తే బంగారం ధర ఎలా పెరుగుతుంది? 

 

కరోనా వైరస్ కారణంగా బంగారం ధర మరి దారుణంగా పెరుగుతుంది. కేవలం రెండు నెలల్లో ఏకంగా ఆరు వేలు పెరిగింది.. దీనికి ఓ కారణం ఉంది.. కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ పై దారుణంగా పడింది.. దీంతో స్టాక్ మార్కెట్ అతిదారుణంగా కుప్పకూలిపోయింది.. ఇంకేముంది ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకింది.. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బంగారం ధర ఇలా కొనసాగుతుంది.. ఇంకా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిల పెరుగుదలతో 46,550 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయిల పెరుగుదలతో 43,750 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 290 రూపాయిల పెరుగుదలతో 41,500 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ తులం 24 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుడగా తులం 22 క్యారెట్ల బంగారం ధర 43 వేలు కొనసాగుతున్నాయి.          

మరింత సమాచారం తెలుసుకోండి: