గొంతు మంట తగ్గాలంటే స్మోకింగ్, వేపింగ్ అనేవి మంచివి కావు. కాబట్టి, స్మోకింగ్‌ని ఎవాయిడ్ చేయడం, అలాగే సెకండరీ స్మోక్ కి దూరంగా ఉండడం వలన గొంతు మంట తగ్గుతుంది.ఇక అలాగే గట్టిగా మాట్లాడటం, అరవటం వంటివి అస్సలు చేయకండి. స్కూల్ టీచర్స్, ఏరోబిక్ ట్రైనర్స్ మరీ ముఖ్యంగా ఈ జాగ్రత్త పాటించాలి.ఇక ముఖ్యంగా తగినంత విశ్రాంతి తీసుకోండి.విశ్రాంతి వల్ల మీ రోగ నిరోధక శక్తి బాగా పని చేస్తుంది.ఇక మరీ ఎక్కువ అలిసిపోయే వ్యాయామాలు కూడా చేయకండి.


అలాగే గోరు వెచ్చని నీటిలో మెత్తని బట్టని ముంచి పిండేయండి. నీళ్లు మరీ అంత వేడిగా లేకుండా చూసుకోండి. ఈ బట్టని మెడ మీద కొన్ని నిమిషాల పాటూ ఉంచుకోండి.మంట తగ్గుతుంది.అలాగే వంటింట్లో దొరికే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తాజా నిమ్మకాయ, కోసి కొద్దిగా కాల్చిన నిమ్మ చెక్క వేడి నీటిలో కాసేపు ఉంచి, ఆ నీటిని తాగితే మంట పోతుంది.టీకి బదులుగా గ్రీన్ టీ, లవంగాల టీ, అల్లం టీ వంటి టీలు తాగితే ఈ సమస్యని బాగా తగ్గిస్తాయి.


ఇక అలాగే పెప్పర్మింట్ టీ, చామోమిల్ టీ, రాస్ప్‌బెర్రీ టీ కూడా గొంతు మంటకి బాగా పని చేస్తాయి. అయితే, హెర్బల్ టీలు తాగే ముందు మాత్రం మీ డాక్టర్‌ సలహా తీసుకోండి.అలాగే ఓ గిన్నెలో వేడి నీరు పోసి అందులో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేయండి.ఇక మీ తలని ఒక టవల్ తో కవర్ చేసుకొని ఇక ఆ గిన్నె మీదకి వంగి ఆ ఆవిరిని తీసుకొని బాగా పీల్చండి. ఇలా పీల్చేటప్పుడు ఆ వేడి నీటి గిన్నె మీ మీద పడిపోకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే ఎలెక్ట్రిక్ స్టీం ఇన్‌హేలర్ లో కూడా యూకలిప్టస్ ఎస్సెన్షియల్ ఆయిల్ కలపుకోవచ్చు.ఇక ఈ ఎస్సెన్షియల్ ఆయిల్స్‌ని డైల్యూటెడ్ ఫార్మ్‌లో మాత్రమే వాడటం చాలా మంచిది.


ఇక అలాగే చికెన్ సూప్ తాగడం వల్ల కూడా గొంతు మంట తగ్గి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అలాగే అనేక రకాల ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే శక్తి కూడా వస్తుంది. ఇక సైనస్ అలాగే నాసల్ ప్యాసేజ్ అనేవి దెబ్బకి క్లియర్ అవుతాయి. అయితే దీనికి ఖచ్చితంగా ఇంట్లో చేసిన చికెన్ సూప్ మాత్రమే వాడాలి.అలాగే ఒక గ్లాసు నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తాగవచ్చు, లేదంటే యాపిల్ సిడార్ వెనిగర్‌తో గార్గ్లింగ్ చేయవచ్చు. యాపిల్ సిడార్ వెనిగర్‌ని ఎప్పుడు వాడినా డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: