ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆధార్ కార్డ్‌కు ఎంత విలువుందో, పాన్ కార్డు కు కూడా అంతే వ్యాల్యూ వుంది. కీలకమైన ధ్రువీకరణ పత్రాల్లో పాన్ కార్డు కూడా ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరి వాలెట్లలోనూ పాన్ కార్డు ఉండే ఉంటుంది. ఇకపోతే ఈ పాన్ కార్డు ఇష్యూ బాధ్యతను ఆదాయపు పన్ను శాఖ రెండు సంస్థలకు అప్పగించింది. అవేంటంటే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ యూటీఐటీఎస్ఎలల్, ఒకటి. మరోటి ఎన్‌ఎస్‌డీల్ టీఐఎన్ ప్లాట్‌పామ్స్ ద్వారా పాన్ కార్డులను ఇష్యూ చేస్తుంది. ఈ రెండు సంస్థల నుంచి దేనిద్వారానైనా పాన్ కార్డు పొందొచ్చు. పాన్ కార్డు పోయినా, లేదంటే డ్యామేజ్ అయినప్పడు రెంటింటిలో ఏ సంస్థకైనా రిప్రింట్ ఆర్డర్ ఇవ్వొచ్చు.


ఇకపోతే ఎన్‌ఎస్‌డీఎల్ లేదా యూటీఐటీఎస్ఎల్ ఆన్‌లైన్ పోర్టల్స్‌కు వెళ్లాలి. అక్కడ రిప్రింట్ పాన్ కార్డు ఆప్షన్ ఉంటుంది. దీనిసాయంతో మీరు మీ పాన్ కార్డు మరో కాపీని పొందొచ్చు. ఈ పాన్ కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది. పాన్ కార్డులో ఎలాంటి మార్పులు అవసరం లేదనుకుంటే.. పాన్ కార్డు పోయిన తర్వాత మళ్లీ రిప్రింట్ ఆర్డర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ పాన్ కార్డు రిప్రింట్ కోసం రెండు ఏజెన్సీలు రూ.50 వసూలు చేస్తున్నాయి. అయితే మీరు భారత్‌లో ఉంటే ఈ చార్జీలు వర్తిస్తాయి. అదే మీరు విదేశాల్లో  ఉంటే పాన్ కార్డు డెలివరీ కోసం రూ.959 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లోని మీ అడ్రస్‌కు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.


ఇకపోతే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. పాన్ కార్డు హార్డ్‌కాపీ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ కాపీ ఉన్న పర్లేదు. యూటీఐటీఎస్‌ఎల్, ఎన్ఎస్‌డీఎల్ టీఐఎన్ ప్లాట్స్‌ఫామ్స్ రెండూ కూడా ఇ-కార్డులను జారీ చేస్తున్నాయి. పీడీఎఫ్ రూపంలో ఇ-పాన్ ఉంటుంది. పాన్ కార్డుకు దీనికి సమానమైన విలువ ఉంటుంది. ఇకపోయిన పాన్ కార్డు కోసం అప్లై చేసే సమయంలో పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు అవసరం అవుతాయి. ఎన్ఎస్‌డీఎల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పాన్ కార్డు రిప్రింట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆధార్ కార్డు నెంబర్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక పాన్ కార్డుతో,  ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఇలా చేయడం ద్వారా మీరు మీ పాన్ కార్డ్‌లను పొందవచ్చూ...


మరింత సమాచారం తెలుసుకోండి: