సాధారణంగా ఎలక్ట్రిక్ కుక్కర్ లో మనం తినే ఆహారాన్ని ముఖ్యంగా అన్నాన్ని ఎక్కువగా ఉడికించి తింటూ ఉంటాము. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ మనం తినే మామూలు బియ్యం కంటే , బాస్మతి బియ్యాన్ని ముఖ్యంగా ఎలక్ట్రిక్ కుక్కర్ లో వుడికించి తినడం వల్ల అత్యంత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వివిధ దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తవచ్చు అని వారు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు రైస్ కుక్కర్ లో బాస్మతి రైస్ వండుకొని తినడం వల్ల షుగర్ కంటెంట్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుందట. అంతేకాకుండా డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

సగటున ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, ప్రతిరోజూ శరీరానికి 1200 -1500 కిలో కేలరీల శక్తి అవసరం అవుతుందట. అయితే ఈ శక్తి ఆడవారిలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఇక మగవారి విషయానికి వస్తే, 1500 - 1800 కిలో కేలరీల శక్తి ఉంటుంది. ఇక ఎవరైతే బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారు ప్రతిరోజు 750 కిలో క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. సగటు మనిషి ఎత్తు , బరువును బట్టి 25 గ్రాములకంటే ఎక్కువ స్థాయిలో చక్కెరను తీసుకోకూడదు. తీసుకుంటే తప్పకుండా డయాబెటిస్ బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారంలో ఏదైనా సరే గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇక శరీరానికి కావలసిన శక్తి అందాలి అంటే తప్పకుండా ఫైబర్ కంటెంట్ మన రోజువారి కి సరిపోయేంత ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అధిక బరువు పెరగకుండా , డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చుమనం తీసుకునే ఆహారంలో పీచు కంటెంట్ తక్కువగా ఉండేలాగా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది.. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి వీలు ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: