మెదడు చురుకుగా పని చేయడం కోసం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండటం.. ముఖ్యంగా మన డైలీ వారి డైట్లో ఆహార పదార్థాలను చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.. అలా కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినడం వల్ల మన మెదడు చురుకుగా పనిచేస్తుంది అని వైద్యులు చెబుతుంటారు. నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది తినడం, తాగడం వంటి పనుల పైన శ్రద్ధ చూపడం లేదనే చెప్పాలి.. వయసు పెరగడంతో పాటు వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇకపోతే మన మెదడు ఆరోగ్యం పెంచేలా చేయాలి అంటే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి అని అంటున్నారు వైద్యులు..


ప్రముఖ హార్వర్డ్ మెడికల్ స్కూల్ పోషకాహార నిపుణులు అయిన డాక్టర్ ఉమానాయుడు మాట్లాడుతూ.. మనసును ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ 5 రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా కణాల శక్తి ఉత్పత్తి లో గ్లూకోజ్ రూపంలో మనము చక్కెరను ఉపయోగిస్తున్నప్పటికీ , అధిక చక్కెర కలిగిన ఆహారం.. మెదడులోకి మరింత గ్లూకోజ్ను తీసుకువస్తుంది .. ఫలితంగా దీని ప్రభావం మెమొరీ పై అధికంగా పడుతుంది. ఇక ఫ్రై చేసిన లేదా సోడా తో సహా అధిక చక్కెర ఉన్న పదార్థాలు కూడా మెదడుపై ప్రభావం చూపుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మగవారు రోజుకు 36 గ్రాముల కంటే ఎక్కువ.. మహిళలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర పదార్థాలను తినకూడదు.


ఇక ఆ తర్వాత ఆయిల్ ఫుడ్.. చాలా మంది చికెన్ ఫ్రై, కచోరి, సమోసా ,ఫ్రెంచ్ ఫ్రైస్ , చిప్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉంటారు.. వీటిని తినడం వల్ల రక్త కణాలు దెబ్బతింటాయి.. కాబట్టి వేయించిన ఆహారాన్ని తినడం పక్కన పెట్టండి. అధికంగా కార్బోహైడ్రేట్స్ ఉండే బ్రెడ్, పాస్తా వంటివి తీసుకోకుండా ఉండాలి. అంతేకాదు ఆల్కహాల్ వంటి వాటికి కూడా దూరంగా ఉంటేనే..మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా చాలా పదునుగా తయారవుతుంది అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: