పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. సరైన జీవిత భాగస్వామి లభించకపోతే ఇక ఆ జీవితమే వ్యర్దం. ఎంత ధనవంతులైనా సరే మన జీవిత భాగస్వామి మనకు కరెక్ట్ కాకపోతే ఇక ఆ జీవితంలో సౌకర్యాలు ఉన్నా సుఖ సంతోషాలు ఉండవు. అందుకే జీవిత భాగస్వాములను ఎంచుకునేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వివాహం అనంతరం మనిషి సరికొత్త జీవితం ఆరంభిస్తారు. వివాహంతోనే తనకంటూ సమాజంలో ఒక కుటుంబం ఏర్పడుతుంది. కాగా వివాహ బంధంలో గృహిణిది ఎక్కువ కీలకం అని తెలిసిందే. ఇల్లును చూస్తే ఇల్లాలు గుణగణాలు అర్దం అవుతాయి అంటారు. అయితే ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి..!! ఎవరు మనకు కరెక్ట్ జీవిత భాగస్వాములు అనే విషయంలో అంతా కన్ఫ్యుజ్ అవుతుంటారు.

అయితే ఒక అధ్యయనం ప్రకారం అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వలన జీవితం సమస్యలు లేకుండా, అద్భుతంగా ఉంటుంది అంటే..  

పురుషుడు వివాహం చేసుకునే సమయంలో ఆస్తి కోసం కట్నం కోసం ఆరాట పడకూడదు. ఎందుకంటే అత్తింటి నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటే  ఆ తర్వాత మాట పట్టింపులు వస్తే అత్తింటి వాళ్లు గట్టిగా మాట్లాడితే తలదించుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితులు చాలామందే ఎదుర్కుని ఉంటారు.  పురుషుడు ఎపుడు కూడా తనకంటే తక్కువ ఆస్తి ఉన్న కుటుంబం నుండి అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యగా చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే డబ్బుల విషయంలో హెచ్చుతగ్గులు రాకుండా ఉంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందట.

అంతేకాదు తమకంటే  తక్కువ ఆస్తి ఉన్న కుటుంబం నుండి అమ్మాయిని భార్యగా స్వీకరిస్తే సమాజంలో అతడికి మరింత గౌరవం పెరగడంతో పాటు అత్తింటి వాళ్లు, ఆ బంధువుల దగ్గర ఉన్నతంగా ఉండటంతో పాటు వారి దగ్గర నుండి ఎక్కువ గౌరవ మర్యాదలు అందుతాయి. అలాగే భార్య దృష్టిలో ముందు జీవితం కంటే మంచి జీవితం ఇచ్చినవాడు అవుతాడట. అలాగే అబ్బాయి ఉద్యోగం, ఆస్తి చూసి చేసుకునే అమ్మాయిలను చేసుకోవడం కూడా మంచిది కాదు. నిదానంగా , నెమ్మదిగా ఉండే అమ్మాయిలు అయితే జీవితం చాలా అందంగా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: