ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం వీటితో రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు.ఓట్స్ లో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈ ఓట్స్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, విటమిన్ బి6, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇంకా అలాగే ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉంటాయి. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు. అయితే చాలా మంది కూడా ఈ ఓట్స్ ను ఉప్మా లాగా లేదా పాలల్లో వేసి ఉడికించి పండ్ల ముక్కలు వేసుకుని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లాగా తింటూ ఉంటారు.వీటిని ఏ విధంగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఓట్స్ ను తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా మంచి ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ ను తీసుకోని తరువాత అందులో దానిమ్మ గింజలను లేదా స్ట్రాబెర్రీ ముక్కలను వేసుకోని ఆ తరువాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును ఇంకా అలాగే అర కప్పు పాలను వేసి కలపాలి. తరువాత ఇందులో తేనె లేదా డేట్ సిరప్ ఇంకా అలాగే ఆపిల్ సిరప్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ ను రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఇక వీటిని ఫ్రిజ్ లో ఉంచి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ ను పొద్దున పూట అల్పాహారంగా తీసుకుంటే చాలా మంచిది. ఇక షుగర్ వ్యాధి గ్రస్తులు అయితే ఇందులో పాలకు బదులుగా పెరుగును కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఓట్స్ ను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఈజీగా లభిస్తాయి. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: