మాములుగా లడ్డులను శనగపిండి, లేదా ఏదైనా పిండి తో చేసుకోవడం చూసాము.. ఇంకా కొందరు మాత్రం కిస్ మిస్, కాజు, పిస్తా లతో కూడా లడ్డుల ను చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా పసుపుతో లడ్డు చేయడం విని ఉండరు.. కానీ వాటితో కూడా లడ్డులను చేయొచ్చున ని కొందరు అంటున్నారు. పసుపు తో కూరలు మాత్రమే కాదు.. తియ్యని స్వీట్స్ ను చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇందుకు కావలసిన పదార్థాలు.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


కావాల్సిన పదార్థాలు:


పచ్చి పసుపు తరుగు: 250 గ్రాములు,

బెల్లం: 250 గ్రాములు,

ఆవునెయ్యి: 4 టేబుల్‌ స్పూన్లు,

బాదం, కాజు: 100 గ్రాములు,

పుచ్చ పలుకులు: 50 గ్రాములు,

కొబ్బరి పొడి: అర కప్పు,

మిరియాల పొడి: అర టీస్పూన్‌,

పొప్పడి పలుకులు: ఒక టీస్పూన్‌


తయారీ విధానం:

ముందుగా కడాయి లో కొద్దిగా నెయ్యి వేసి బాదం, కాజు, పుచ్చ పలుకులు వేయించాలి. చల్లారాక మిక్సీపట్టి పొడి చేసుకోవాలి. అదే కడాయి లో పొప్పడి పలుకులు వేయించి పక్కన ఉంచుకోవాలి. మళ్లీ కడాయిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి, పసుపు తరుగు వేసి అడుగున అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోగిన్నెలో బెల్లం పాకం పట్టుకోవాలి. అందులో బాదం, కాజు, పుచ్చపలుకుల పొడి, పొప్పడి పలుకులు, కొబ్బరి పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత చివరి లో పసుపు తరుగు వేసి  మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలపాలి.. ఆ తర్వాత బాగా చల్లార్చి ఉండలుగా చేసుకోవాలి అంతే రుచి కరమైన లడ్డూలు రెడీ.. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు అస్సలు వదలకుండా తింటారు.. ఇవి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: