ఒకప్పటి జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి ఎంతో వ్యత్యాసం ఉంది. మారుతున్న కాలంతో పాటు పద్దతులు, అలవాట్లు, అభిరుచులు ఇలా ఎన్నో మారాయి. మోడ్రన్ కల్చర్ కి జనాలు బాగా అలవాటు పడ్డారు. ఇదే క్రమంలో హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రత, ప్రావీణ్యం కలిగిన వివాహ వ్యవస్థ, వేడుకలు వాటి పద్దతులు కూడా మారుతున్నాయి. సంప్రదాయం మారిందని చెప్పలేము. కానీ పద్దతులు కొంచెం కొంచెంగా మారుతున్నాయి. అప్పట్లో ప్రేమ వివాహలు చాలా తక్కువ. ఇక ఇప్పుడేమో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి.

పెద్దలు కుదిర్చిన సంబంధాలు అయినా చాలా వరకు పెళ్ళి కొడుకు,పెళ్ళి కూతురు ఒకరినొకరు కలుసుకుని బాగా అర్దం చేసుకున్న తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంతగా అమ్మాయిల మరియు అబ్బాయిల ఆలోచనలు, అభిరుచులు మారుతున్నాయి.  ఇటువంటి వివాహాలకు అనుగుణంగా తమకు నచ్చిన, తమకు తగిన జీవిత బాగా స్వామిని ఎంచుకునే అవకాశాలు కల్పిస్తూ చాలా ఆన్ లైన్ యాప్ లు వస్తున్నాయి. మాట్రిమోనీ, జీవన్ సాతి అంటూ చాలా మ్యారేజ్ బ్యూరో యాప్ లు పాపులర్ అయ్యాయి. ఇవే కాకుండా డేటింగ్ యాప్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. చాలా మంది ఈ డేటింగ్ యాప్స్ సేవలను వినియోగించుకుని తమకు నచ్చిన జీవిత భాగస్వాములను ఎంచుకుంటున్నారు.

కానీ మీకు కావాల్సిన భర్త లేదా భార్య ఏ విధంగా ఉండాలి అనేది డేటింగ్ యాప్ లోనూ, లేదా మ్యారేజ్ బీయూరో సైట్ లోనూ సెలక్ట్ చేసుకుని ముందుకు వెళ్లే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వీరు పెట్టే ప్రొఫైల్స్ కొన్ని ఫేక్ లుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి వలన కొందరు మోసపోతున్నారు. అయితే అన్ని సైట్ లు ఇలాగె ఉంటాయి అందం లేదు. కానీ వెంటనే కమిట్ కాకుండా అన్ని విషయాలు ఆలోచించుకుని ముందుకు వెళ్లడం మంచిదని అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: