సెంచ‌రీ కొట్టిన త‌ర‌వాతే మాంఛి ఊపుమీదికొచ్చాడు శ్రీ‌కాంత్‌. చేతినిండా సినిమాలే. మొన్నే నాటుకోడి కూత‌కొచ్చింది. మొండోడు సెట్స్‌పై ఉంది. ఈలోగా కొత్త ద‌ర్శ‌కుడు.. ఎ.ఉద‌య్‌రాజ్ కి ఓకే చెప్పేశాడు. ఇవి కాక మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. మ‌హాత్మ త‌ర‌వాత దాదాపు డ‌జ‌ను సినిమాలు చేశాడు. అయితే ఒక్క‌టీ హిట్ కాలేదు. క‌నీసం ఆ ద‌రిదాపుల్లోకి కూడా రాలేదు. మాస్‌, కామెడీ, యాక్ష‌న్‌, సెంటిమెంట్ ఇలా ఒక్క జోన‌ర్ కాకుండా అన్నీ ట్రై చేశాడు. చివ‌రికి ఫాంట‌సీ కూడా ఒక్క‌టీ వర్క‌వుట్ కాలేదు.

అయినా శ్రీ‌కాంత్‌ని నిర్మాత‌లు న‌మ్ముతున్నారు. ఎందుకంటే అత‌నికంటూ ఓ శాటిలైట్ మార్కెట్ ఉంది. సినిమా టీవీవాళ్ల‌కు అమ్ముకొంటే బ‌డ్జెట్‌లో స‌గం వ‌చ్చేస్తుంది అని లెక్క‌గ‌డుతున్నారు నిర్మాత‌లు. శాటిలైట్‌ని నమ్ముకొని బ‌రిలోకి దిగుతున్నారు. దాన్ని శ్రీ‌కాంత్ బాగానే సొమ్ము చేసుకొంటున్నాడు. ఎలాంటి క‌థ‌నైనా తేలిగ్గా ఒప్పుకొని, మొక్కుబ‌డి తంతుగా సినిమాలు లాగించేస్తున్నాడు. అందుకే త‌న స‌క్సెస్ రేటు భారీగా త‌గ్గిపోయింది.

��

 రెమ్యున‌రేష‌న్‌తో పాటు క‌థ‌నీ న‌మ్ముకొంటే - మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. మ‌రి ఇప్పుడైనా క‌నీసం ఆ బాట‌లో న‌డుస్తే.. శ్రీ‌కాంత్ నుంచి క‌నీసం ఒక్క హిట్ అయినా చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. లేదంటే సినిమాల సంఖ్య పెంచుకొంటూ వెళ్తాడంతే!

మరింత సమాచారం తెలుసుకోండి: