బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన “2 స్టేట్స్” సినిమా టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పుడు సజావుగా సాగటం లేదు. ప్రముఖ రైటర్ చేతన్ భగత్ రాసిన నవల “2 స్టేట్స్” ఆధారంగా అదే పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అడవి శేష్ మరియు జీవిత రాజశేఖర్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి మొట్టమొదటిసారిగా మెగాఫోన్ చేపట్టాడు.

Image result for adivi sesh 2 states

ఇంతకుముందే చిత్రం మొదలవగా, దర్శకుడు వెంకట్ రెడ్డి ప్రవర్తన కారణంగా ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. వెంకట్ రెడ్డి మొదటి సినిమా కావడంతో అతనికి స్క్రిప్టు పైన కూడా అస్పష్టత ఉందని, ముందే ఒక లే అవుట్ లేకుండా స్పాట్ లో ఎప్పటికప్పుడు సన్నివేశాలు రాసుకుంటున్నాడట. ఇంక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ శానియల్ డియో, టాప్ ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకట్ రెడ్డి వల్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. 

Image result for adivi sesh 2 states

దర్శకుడు సెట్స్ లోకి వచ్చి సీన్లు రాయడం వలన అతనికి, టెక్నీషియన్స్ కి మధ్య సఖ్యత కుదరక పలు ఆటంకాలు ఏర్పడడంతో వారు ఈ సినిమా నుండి తప్పుకున్నారట. అలాగే మొదటి సినిమా తీస్తున్న ఇతని ప్రవర్తన టెక్నీషియన్స్ తో సరిగ్గా లేకపోవడం, వారిని సరిగ్గా గౌరవించకపోవడం వల్ల వారు ఈ సినిమా కి బై చెప్పారు. ఇప్పుడు ఆ చిత్రీకరణ విషయమై అంతా సందిగ్ధత నెలకొంది. త్వరలోనే ఈ చిత్రం మళ్లీ పట్టలెక్కి అంతా సజావుగా సాగాలని ఆశిద్దాం.
ReplyForward



మరింత సమాచారం తెలుసుకోండి: