పవన్ కళ్యాణ్ కి కొందరు టార్గెట్ గా ఉన్నారు. ఆయన రాజకీయాల్లో కొందరికి సెలెక్ట్ చేసుకుని మరీ మాటల బాంబులు పేలుస్తారు. ఆయన ఒక వైపే చూస్తూ గత  అయిదేళ్ళుగా రాజకీయం చేస్తున్నారని వైరి పక్షాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా  పవన్ కూడా కొందరికి టార్గెట్ అన్న సంగతి తెల్సిందే. వారు రాజకీయ రంగానికి చెందిన వారే కానక్కరలేదు. అందుకే ఇపుడు పవన్ మీద‌నే ఓ హాట్ ఘాటు కామెంట్ పడింది అన్న డౌట్లు వస్తున్నాయట.


ఇంతకీ పవన్ మీద ఇండైరెక్ట్ గా ఆ హాట్ కామెంట్ చేసింది ఎవరు అంటే హీరోయిన్ పూనంకౌర్ అంటున్నారు. పూనంకౌర్ మళ్ళీ చాన్నాళ్ళ తరువాత సోషల్ మీడియా ముందుకు వచ్చింది. ఆమె ట్విట్టర్ ఖాతాలో లేటెస్ట్ గా చేసిన ఓ కామెంట్ పై ఇపుడు పవన్ ఫ్యాన్స్ గుర్రు మీద ఉన్నారని టాక్. దానిపైన వారు మండిపోతున్నారుట. నిజానికి కామెంట్ ని మాములుగా చూస్తే ఏమీ లేదు. అర్ధాలు వెతుక్కుంటే మాత్రం బోలెడు ఉందనినిపించేలా పవన్ ఫ్యాన్స్ రచ్చ ఉంది.


ఇంతకీ పూనంకౌర్ ట్విట్టర్ లో ట్వీటింది ఎలాగంటే అబద్దాల కోరు రాజకీయ నాయకుడు  అయితే కావచ్చేమో కానీ నాయకుడు మాత్రం ఎప్పటికీ కాలేడు, ఇట్స్  ఎ  థాట్  అంటూ. మరి దీంట్లో అర్ధాలు చాలానే ఉన్నాయి కదా. అర్జంట్ గా పూనంకి రాజకీయ నాయకులు ఎందుకు గుర్తుకు వచ్చారు అన్నది కూడా ఇక్కడ చూడాలి. సినిమాల నుంచి రాజకీయాల్లో నుంచి వచ్చిన పవన్ గురించేనా ఈ కామెంట్ అని అనుకోవడానికి పవన్ జన నాయకుడిగా మారలేకపోయారు. కనీసం ఎమ్మెల్యే కాలేకపోయారు. అదే బాబు, జగన్ అయితే ముఖ్యమంత్రులు అయ్యారు. అన్నట్లు పూనం పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో కనిపిస్తారు. మొత్తానికి పూనం ఏ ఉద్దేశ్యంతో  కామెంట్ పెట్టినా కూడా అది పవన్ మీదేనని ఫ్యాన్స్ గొడవ చేయడంతోనే ఇపుడు వస్తోంది తంటా అంతా.



మరింత సమాచారం తెలుసుకోండి: