పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ గా ఎదిగింది అంతా కొత్త టాలెంట్ తోనే.. స్టార్ డైరక్టర్స్ తో చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం కొందరి లెక్క కానీ కొత్త వాళ్ళతో తీసి ఆ సినిమాలతో హిట్టు కొడుతూ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం మాత్రం పవన్ కళ్యాణ్ కె చెల్లింది. మాములుగా ఒక స్టార్ తో సినిమా చేయాలంటే ఇదివరకు ట్రాక్ బాగుండాలి కానీ పవన్ మాత్రం మెప్పించేలా కథ చెబితే చాలు వాళ్లకు ఛాన్స్ ఇచ్చేస్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాథ్ పవర్ స్టార్ తో బద్రి సినిమా చేసి హిట్ కొట్టాడు. 

 

పూరి ఒక్కడే కాదు కరుణాకరన్, అరుణ్ ప్రసాద్, ఖుషీతో ఎస్.జె సూర్యని కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు పవన్. ఒకానొక టైం లో అందరు దర్శకులు పవన్ కోసం కథ అనుకుని రాసి అతనికి వినిపించి ఆయన కాదన్నాకనే వేరే హీరోల దగ్గరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్న స్టార్స్ లో కొంతమంది పవన్ చేయనని చెప్పిన సినిమాలు చేసి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే కేవలం పవన్ సినిమాల వల్లే కాకున్నా పవన్ కాదన్న సినిమాలు వారి పంథాలో చేసి హిట్టు కొట్టారు. 


కథ బాగా చెప్పగలిగే దర్శకులకు పవన్ ఛాన్స్ ఇచ్చేస్తాడట. తన దగ్గరకు ఒక కథ తెచ్చిన దర్శకుడు చెప్పిన కథ బాగా అనిపిస్తే చాలు మిగతా విషయాల గురించి పవన్ అసలు ఆలోచించాడట. అందుకే ఆయన్ను దర్శకులు కూడా ఎంతో ఇష్టపడతారు. పాతిక సినిమాల కెరియర్ లో పవర్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న పవన్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ అంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: