ఏడేళ్ల వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోయినా, టాప్ లీగ్ లో కంటిన్యూ కావడం అంత ఈజీ కాదు. బోల్డంత ఫాలోయింగ్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇలాంటి ఫాలోయింగ్ తోనే టాలీవుడ్ లో పవర్ స్ట్రోమ్స్ సృష్టిస్తోన్న హీరో పవన్ కళ్యాణ్.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ నుంచే తన మార్క్ చూపించాలని ట్రై చేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న పవన్, డెబ్యూ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో రియలిస్టిక్ స్టంట్స్ చేశాడు. ఆ రిస్కీ స్టంట్స్ కి యూత్ ఫుల్లుగా ఇంప్రెస్ అయిపోయారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పవన్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు కుర్రాళ్లు.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి మూడేళ్లు ఎదురు చూశాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం’ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే కరుణాకరన్ డైరెక్షన్ లో చేసిన ప్యూర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘తొలి ప్రేమ’తో బాక్సాఫీస్ దగ్గర పవర్ హిట్ కొట్టాడు పవన్. ఇక ఈ బ్లాక్ బస్టర్ తో మొదలుపెట్టి ‘తమ్ముడు, బద్రి, ఖుషీ’తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.. పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్.

పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైమ్ లో వరుస ఫ్లాపులొచ్చాయి. ‘జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, పులి, తీన్మార్, పంజా’ ఇలా వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డాడు పవన్. అయితే ఏడేళ్లపాటు సరైన బ్లాక్ బస్టర్ లేకపోయినా, పవన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే చిరంజీవి సినిమాల నుంచి తప్పుకున్నాక హిట్స్ లేకపోయినా టాప్ రేసులో నిలిచాడు. ‘గబ్బర్ సింగ్’తో మళ్లీ అభిమానులని ఇంప్రెస్ చేశాడు. ‘అత్తారింటికి దారేది’ హిట్ తో టాప్ స్టార్ గా అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: