యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మల్టీస్టారర్ దేవదాస్. అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పాత్రాకం పై సి.అశ్వనీదత్ నిర్మించారు. నాని కి జంటగా రష్మిక మందన్న, నాగార్జున కి జంటగా ఆకాంక్ష సింగ్ నటించారు. భారీ అంచనాల మద్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. మల్టీస్టారర్ అన్న పేరే గాని కథలో పట్టు లేకపోవడంతో ఊహించని విధంగా నాని, నాగార్జున లకి షాకిచ్చింది.

ఇక నాని రీసెంట్ గా మరో మల్టీస్టారర్ ' వి ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజైంది. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరీ, సుధీర్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే డి.సి.పి ఆదిత్య గా నటించిన సుధీర్ బాబు కి మంచి పేరు వచ్చింది తప్ప నాని కి మాత్రం ఈ సినిమా పెద్దగా ఉపయోగపడలేదన్న టాక్ వినిపించింది.

ఇక ఈ సినిమా తర్వాత నాని మరో రెండు సినిమాలు కమిటయిన సంగతి తెలిసిందే. నాని కి నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ తో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సగభాగం చిత్రీకరణ జరుపుకుంది. అలాగే టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

కాగా తాజాగా నాని మరో మల్టీస్టారర్ లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నాని, రానా దగ్గుబాటి కలిసి నటించబోతున్నారట. ఇండస్ట్రీలో వున్న హీరోల్లో ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో వీరిద్దరిని కలిపి ఒక సినిమాలో నటింపచేయాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారకంగా వెల్లడించనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే రెండు మల్టీస్టారర్స్ లో నటించిన నాని కి హిట్ పడలేదు. అందుకే మళ్ళీ మాల్టీస్టారరా అంటూ కొంతమంది పేదవి విరుస్తున్నారని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: