అమితాబ్ భార్య జయాబచ్చన్ చాల వ్యక్తిత్వం ఉన్న మహిళ. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా ఆమె మాట్లాడుతుంది అని అంటారు. అటువంటి జయకు ఏమైందో తెలియదు కాని ఆమె బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్‌ ఖాన్‌ పై చేస్తున్న మాటల దాడి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  మొన్న దీపావళికి విడుదలైన షారుఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా గురించి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వచ్చిన అర్థరహితమైన సినిమా అంటే ఇదేనని అంటూ అందువల్లనే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నానని జయబచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.  ఈ సినిమాలో తన కొడుకు అభిషేక్ నటించాడన్న పక్షపాతం లేకుండా జయాబచ్చన్ విమర్శలు గుప్పించడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ వ్యాఖ్యలకు షాక్ కు గురైన అమితాబ్ ‘సారీ’ అంటూ షారుఖ్‌కి మెసేజ్ పెట్టాడటమే కాకుండా అభిషేక్, ఐశ్వర్య క్షమాపణలు చెప్పడానికి ఏకంగా బాద్షా ఇంటికే వెళ్లారని టాక్.  అయితే షారుఖ్ దర్సనం వీరికి ఇవ్వలేదని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. జయ మాటలకు రెచ్చి పోయిన షారుఖ్ మీ భర్త నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ కూడా అర్థరహితంగా ఉందని అప్పట్లో కామెంట్స్ రాలేదా అంటూ జయ పై మాటల దాడి చేసాడు. ప్రస్తుతం వీళ్ల మధ్య మాటల యుద్ధం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: