పూరీ జగన్నాథ్ బాలకృష్ణ తో మళ్ళీ ఒక సినిమా చేయాలని గత కొంతకాలంగా చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘పైసా వసూల్’ మూవీ తరువాత వీరిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం మరో సినిమా ప్రాజెక్ట్ కు అవకాశం వచ్చి తీరుతుందని అందరు భావించారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మోక్షజ్ఞ వచ్చి చేరే అవకాశం ఉంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.


వాస్తవానికి మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉండటం కొంతకాలం ఆ వార్తల హడావిడి జరిగిన తరువాత నెమ్మదిగా ఆ వార్తలు చల్లారి పోవడం జరుగుతున్న విషయమే. అయితే ఈసారి అలాంటి సందర్భం ఎదురవ్వకపోవచ్చు అని అంటున్నారు. పూరీ జగన్నాథ్ రెడీ పెట్టిన ఈ పవర్ ఫుల్ కథలో బాలయ్యకు మోక్షజ్ఞ కు సరిసమానమైన ప్రాధాన్యత ఉంటుది అని టాక్.


గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి ఆలోచనలు చేస్తున్న బాలయ్య తన కొడుకుతో విడిగా సినిమా చేయించకుండా ఆ మూవీ ప్రాజెక్ట్ లో తాను కూడ కీలక పాత్రలో నటిస్తే ఆ ప్రాజెక్ట్ నందమూరి అభిమానులందరికీ సులువుగా కనెక్ట్ అవుతుందని బాలయ్య ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ సినిమా కెరియర్ పట్ల పెద్దగా ఆశక్తి చూపించడం లేదు అన్న గాసిప్పులు వచ్చిన పరిస్థితులలో ఈ నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టాలి అంటే మోక్షజ్ఞ మూవీ ప్రాజెక్ట్ లో తాను కూడ కీలక పాత్ర చేసినప్పుడే ఆ ప్రాజెక్ట్ కు ఒక క్రేజ్ ఏర్పడుతుందని బాలయ్య ఆలోచన అని అంటున్నారు.


అనేకమంది టాప్ యంగ్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన ట్రాక్ రికార్డు పూరీ సొంతం. ముఖ్యంగా రామ్ చరణ్ ను ‘చిరుత’ మూవీ ద్వారా పరిచయం చేసిన పూరి హస్తవాసి ఆమూవీ ఘన విజయానికి పెద్దగా సహాయ పడకపోయినా పూరీ ఇచ్చిన ప్రోత్సాహంతో చరణ్ ఆతరువాత టాప్ యంగ్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు సినిమాల పట్ల పెద్దగా ఆశక్తికనపరచని మోక్షజ్ఞ కు పూరి తన మాటలతో మోక్షజ్ఞ ను మార్చితీరుతాడని బాలయ్య నమ్మకం అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: