కన్నడ స్టార్ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా కేజేఎఫ్ చాప్టర్ 1 రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీ గా తెలుగు సహా పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ కొట్టి నిర్మాతలకు కాసులు కురిపించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా చాప్టర్ 2 తెరకెకుతున్న విషయం తెలిసిందే.

అయితే చాప్టర్ 1 ని మీంచే విధంగా మరింత భారీగా అత్యున్నత లెవెల్లో ఈ మూవీ ని నిర్మాతలు నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటులు రావు రమేష్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలు చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవి యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది జులై 16 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా రవీనా టాండన్ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారు.

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ లో హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, మధ్యలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి అత్యద్భుతంగా ఉంటాయని, అలానే మొదటి భాగాన్ని మించేలా ఇందులో పలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయని, తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు రాఖీ ఏ విధంగా శత్రువులని ఎదుర్కొన్నాడు అనేది ఈ భాగం యొక్క ప్రధాన కథాంశం అని అంటున్నారు. మొత్తంగా ఈ సారి కూడా నో డౌట్ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం రికార్డుల పుచ్చ పగిలిపోవాల్సిందే అంటూ కేజీఎఫ్ చాప్టర్ 2 సక్సెస్ పై పలువురు మూవీ లవర్స్, ఆడియన్స్  ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: