మెగాస్టార్ చిరంజీవి అన్నా,  కింగ్ నాగార్జున అన్నా ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే, ప్రేక్షకులు ఎంత హడావిడి చేస్తారో, ఇక నాగార్జున సినిమాలు విడుదల అవుతున్నాయి అన్నా కూడా అభిమానులు అంతే స్థాయిలో హడావిడి చేయడం సహజం. ఇక అదే స్థాయిలో వీరిద్దరూ కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ వీరిద్దరూ ఇది వరకే ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో నటించి, ప్రేక్షకుల చేత విందు భోజనం తినిపించారు. ఇక ఆ సినిమా ఏదో కాదు రాఘవ లారెన్స్, ప్రభుదేవా కలిసి నటించిన స్టైల్ సినిమా.

స్టైల్ సినిమా 2006 వ సంవత్సరంలో రాఘవ లారెన్స్, ఏవీ రత్నం దర్శకత్వం వహించగా, లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు.  ఇక ఈ సినిమా విశేషాలు చూస్తే, ఇందులో సీనియర్ నటి జయసుధ, ఛార్మీ కౌర్ ,రాజా, కమలినీ ముఖర్జీ , సమీర్ వంటి ప్రముఖ నటులు నటించి, హిట్ కొట్టారు. డాన్సే ప్రాణంగా కొనసాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. ఇక రాఘవ లారెన్స్ కు తల్లి పాత్రలో సీనియర్ నటి జయసుధ నటించగా, ఇక తల్లిని వెతుకులాటలో రాఘవ లారెన్స్ పడిన కష్టాలు ప్రేక్షకుల చేత కన్నీటిని తెప్పించాయి.

ఇక గెస్ట్ రోల్ విషయానికి వస్తే, స్టైల్ సినిమాలో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్ లో నటించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ముందు నుంచే రాఘవ లారెన్స్ చిరంజీవి గారికి వీరాభిమాని.ఇక అందుకే లారెన్స్ రిక్వెస్ట్ చేయడంతో చిరంజీవి ఈ సినిమాలో నటించారు. ఇక నాగార్జున తో డాన్ సినిమాలో లారెన్స్ కలిసి నటించారు. అక్కడ ఏర్పడిన చనువు , అభిమానం చివరకు నాగార్జున స్టైల్ సినిమాలో గెస్ట్ రోల్ చేసేలా చేసింది. అంతేకాదు లారెన్స్ అంటే నాగార్జున గారికి  అభిమానం కూడా..అందుకే ఈ సినిమా క్లైమాక్స్ లో వారు ఇద్దరూ నటించి, ఈ సినిమా ను సూపర్ హిట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: