సోషల్ మీడియా ద్వారా ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది. చాలామంది సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో క్రేజ్ ని కూడగట్టుకున్నారు. కానీ కొంతమందికి మాత్రం ఇక్కడ జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ నటికి కూడా అలాంటి  పరిస్థితే ఎదురైంది. 

వివరాల్లోకి వెళితే... బెంగాలీ టీవీ నటి ప్రత్యూష పాల్ తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని, తన మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్ సైట్లలో రిలీజ్ చేశారని ఆరోపించింది. ఈ విషయం గురించి ప్రత్యూష సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ప్రత్యూష ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అనంతరం నటి మీడియాతో మాట్లాడుతూ తనకు అత్యాచార బెదిరింపులు ఎదురయ్యాయని వెల్లడించింది. అయితే పోలీసులను సంప్రదించగా వారు ఆ బెదిరింపులు పెద్దగా పట్టించుకోవద్దని చెప్పారని చెప్పు వచ్చింది. కానీ బెదిరింపులకు పోవడంతో భయపడిన ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం నుండి ఇ ఇదే తంతు జరుగుతున్నట్టుగా ఆమె వెల్లడించింది. బెదిరింపులు చేసిన వ్యక్తులను బ్లాక్ చేసినప్పటికీ వాళ్ళు ఇతర ఖాతాల ద్వారా మళ్లీ తనను వేధించే వారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తన మార్ఫింగ్ ఫోటోలను పోర్న్ సైట్ లలో విడుదల చేశారని, అంతేకాకుండా ఆ ఫోటోలను నటి తల్లి స్నేహితులు కూడా పంపారని పేర్కొంది. ఇది నిజంగానే ఆందోళన కలిగించే విషయం. పోలీసులు నిందితులను పట్టుకుని తగిన శిక్ష విధించాలని నటి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. గతంలో కూడా చాలామంది నటీమణులు టాప్ స్టార్స్ అయినప్పటికీ పలు విషయాల్లో సోషల్ మీడియా ద్వారా అత్యాచార బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఇలాంటి అసహ్యకరమైన పనులను చేసే వారు మరోసారి మహిళల గురించి చెడుగా మాట్లాడాలన్నా భయపడేలా అత్యంత కఠినమైన చట్టాలని తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: